శిల్పకళావేదికలో కాయమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల ఉత్సాహానికి స్పందనగా పవన్ పొలిటికల్ స్టేట్ మెంట్ సీఎం అయితే మంచిది. లేకుంటే మరీ మంచిది, పోరాటం ఆగదన్న పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాటమరాయుడు టీమ్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో సింపుల్ గా నిర్వహించమని చెప్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు థీట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ నే కాక ప్రేక్షకులందర్నీ మెప్పించింది. కాటమరాయుడు సినిమా సత్తా ఏంటో ఈ ట్రైలర్ తోనే తేలిపోయింది. ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొట్టే దిశగా కాటమరాయుడు దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక రికార్డుల సంగతి ఎలా ఉన్నా ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్స్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాయి. తన మొదటి సినిమా నుంచి కాటమరాయుడు వరకు అన్ని సినిమాలు తన జీవితంలోని పలు దశలకు అద్దంపడతాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు. మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక రాజకీయంగా కూడా కాయమరాయుడు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అభిమానులంతా సీఎం సీఎం అంటూ అరుపులతో కేరింతలు పెట్టడంతో.. స్పందించిన పవన్ కళ్యాణ్... వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తామని, అధికారం వస్తే మంచిది, రాకుంటే మరీ మంచిది అని అన్నారు. కానీ పోరాటం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అధికారం, డబ్బు ఉన్నంత మాత్రాన గొప్పతనం కాదని, శరీరంలో రక్త మాంసాలున్నన ప్రతి ఒక్కరు సమానమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఖుషి సమయంలో తాను కోల్పోయిన స్థైర్యం గబ్బర్ సింగ్ సినిమాతోగానీ తిరిగి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి మనిషిలోనూ శక్తి సామర్థ్యాలుంటాయని హార్వర్డ్ లో చెప్పిన విషయం గుర్తు చేశారు.
చిరంజీవి గారే హీరో...
నన్ను సుస్వాగతం హిట్టయినప్పుడు కర్నూల్ వెళ్తే... అక్కడ ఊరేగింపు చేస్తామన్నారు. 5కిలోమీటర్లు పొడవునా చిరంజీవి అయితే... సరిగ్గా ఉంటుంది కానీ నన్ను ఊరేగించి బలిపసువును చేయొద్దని కోరా. చిరంజీవి గారే నా దృష్టిలో హీరో. అయినా.. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టు చేతులు ఊపకుండా అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుక సాగా.. అలా అభిమానం అంటే ఏంటో చూసానన్నారు పవన్ కళ్యాణ్.
