Asianet News TeluguAsianet News Telugu

Raja Vikramarka OTT :'రాజా విక్రమార్క' ఓటీటిలో ఈ రోజు నుంచే..డిటేల్స్

విక్రమ్‌.. ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఏజెంట్‌. చిన్నప్పుడు కృష్ణ సినిమాలు, పెద్దయ్యాక టామ్‌క్రూజ్‌ చిత్రాలు చూసి ఆవేశంతో ఎన్‌ఐఏలో చేరాడు. కొన్నాళ్లకి తన సరదా తీరిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అతను ఆ జాబ్‌లో కొనసాగాడా? వదిలేశాడా? అసలు విక్రమ్‌ కథేంటి? తెలియాలంటే ‘రాజా విక్రమార్క’ సినిమా చూడాల్సిందే. 

Kartikeya Raja Vikramarka Official OTT Release Date
Author
Hyderabad, First Published Jan 13, 2022, 4:02 PM IST


యువ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన  చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అయ్యారు. కార్తికేయ సరసన సీనియర్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. రివ్యూలు సరిగా రాలేదు. దాంతో చాలా మంది ఈ సినిమాని థియోటర్ లో చూడలేదు. దాంతో ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు వచ్చింది.  

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ ని  SunNXT వారు సొంతం చేసుకున్నారు. ఈ రోజు అంటే 13 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో  'మిషన్ ఇంపాజిబుల్' స్పూర్తితో రాజ రాజా విక్రమార్క తీశానని చెప్పాడు దర్శకుడు. ఆ హాలీవుడ్ ఛాయిలు ఈ సినిమాలో అక్కడక్కడా కనిపిస్తాయి.

కథేంటంటే..

అత్యుత్సాహి అయిన విక్ర‌మ్ అలియాస్ రాజా విక్ర‌మార్క నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆఫీసర్. ఉద్యోగ నిర్వహణలో ఓ మాజీ న‌క్స‌లైట్ గురు నారాయ‌ణ (ప‌శుప‌తి)వ‌ల్ల‌.  హో మినిస్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి (సాయి కుమార్‌)కి   ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది. వివరాలు పూర్తిగా తెలుసుకునేలోగా విక్ర‌మ్ హడావిడి,తొందరపాటుతనం వ‌ల్ల‌.. హోం మినిస్ట‌ర్ కేసులో దొరికిన కీల‌క‌మైన ఆధారం నాశనం అవుతుంది.  దాంతో విక్రమ్ కు   హోం మంత్రిని కాపాడే మిషన్ లోకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్దితి వస్తుంది. అయితే ఇక్కడే మెలిక హోం మినిస్ట‌ర్ ని కాపాడాలి కానీ, అది ఆయన కి తెలియ‌కుండా జరగాలి. ఆ టాస్క్‌ ని నెరవేర్చేందుకు  విక్ర‌మ్ ఎల్‌.ఐ.సీ ఏజెంట్ గా మారితాడు. 

మంత్రి ఇంటిపై రెక్కీ చేసే క్రమంలో ఆయన కూతురు క్రాంతి (తాన్య రవిచంద్రన్)ని ప్రేమలో పడతాడు. ఈ లోగా విక్రమ్ కు  మరో ఊహించని ట్విస్ట్ ఎదురౌతుంది. ఫైనల్ గా విక్రమ్ ప్రేమ కథ ఫలించిందా.  చివరకు హోమ్ మంత్రి పై జరిగే ఎటాక్ ని తప్పించగలిగాడా?ఆ ట్విస్ట్ ఏమిటి,  ఈ కథలో గోవింద్ నారాయ‌ణ (సుధాక‌ర్ కోమాకుల‌) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   
 
న‌టీన‌టులు: కార్తికేయ‌, తాన్య ర‌విచంద్ర‌న్‌, సుధాక‌ర్ కోమాకుల‌, సాయికుమార్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌శుప‌తి, హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ త‌దిత‌రులు;
 సంగీతం: ప్ర‌శాంత్ ఆర్‌.విహారి; 
ఛాయాగ్ర‌హ‌ణం: పీసీ మౌళి; 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ స‌రిప‌ల్లి;
 నిర్మాత: 88 రామారెడ్డి; 
విడుద‌ల తేదీ:  12-11-2021.
రన్ టైమ్: 2 hr 19 Mins
 

Follow Us:
Download App:
  • android
  • ios