Asianet News TeluguAsianet News Telugu

కనివిని ఎరుగని ఆట మొదలెట్టిన కార్తికేయ.. ఇంట్రెస్టింగ్ గా ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ పోస్టర్!

‘ఆర్ ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. హీరోయిన్ గా  నేహా శెట్టి నటిస్తోంది. రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. 
 

Kartikeya and Neha Sharmas Bedurulanka 2012 movie first look release!
Author
First Published Nov 30, 2022, 12:49 PM IST

‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ (Kartikeay), ‘డీజే టిల్లు’ ఫేమ్  నేహా శెట్టి (Neha Sharma) జంటగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ చిత్రాన్ని నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని  తాజాగా ఈ సినిమాను నిర్మించారు.  లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు కాగా.. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. 

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం  నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్  అప్డేట్స్ అందిస్తూ ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ ఫస్ట్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. వినూత్నంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.    

మోషన్ పోస్టర్ చూస్తే 'బెదురులంక 2012' ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. కార్తీకేయ మరింత ఎనర్జిటిక్ గా కనిపించోతుున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. 

మూవీలోని ఐదు పాటలకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారని మేకర్స్ తెలిపారు. ఇందులో ఓ పాటకు దివంగత, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషంగా భావించారు. కెమెరా వర్క్ సూపర్ గా ఉందని, ఆర్ట్ వర్క్ ను కూడా ఆడియెన్స్ ఫెంటాస్టిక్‌గా ఫీల్ అవుతారని తెలిపారు. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులను 'బెదురులంక' కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios