డే నైట్ లో స్టార్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరిగేది. కోట్ల మందిలో ఎవరికో ఒకరికి ఆ అదృష్టం ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం కార్తికేయ పరిస్థితి కూడా అలానే మారిందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మొదటి సినిమా ప్రేమతో మీ కార్తీక్ అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆ తరువాత చేసిన ఆర్ఎక్స్100 సినిమా అతనికి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ని అందించింది. దీంతో డే నైట్ లోనే అతని ఇంటిముందు నిర్మాతలు క్యూ కట్టారు. కానీ రీసెంట్ గా వచ్చిన హిప్పీ సినిమాతో కార్తికేయ కెరీర్ ఊహించని విధంగా మలుపు తిరిగింది. 

ఆ సినిమా ఓపెనింగ్స్ చూస్తేనే అసలు కార్తికేయ ఎలాంటి క్రేజ్ అందుకున్నాడో అర్ధమవుతుంది. వీకెండ్ లోనే ఆర్ఎక్స్100 3కోట్లతో పెట్టినపెట్టుబడిని వెనక్కి తెస్తే హిప్పీ మాత్రం కనీసం కోటి కూడా దాటలేకపోతోంది.  పైగా RX100 సినిమా కంటే హిప్పీ సినిమాకు ఎక్కువగా బడ్జెట్ పెట్టారు. 

హిప్పీ సినిమాకు మొదటి నుంచి పెద్దగా బజ్ లేదు. ఆర్ఎక్స్100 కు మొదట సాంగ్స్ మంచి బూస్ట్ ఇవ్వగా ఆ ఆ తరువాత సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ జనాలను ఎట్రాక్ చేసింది. అయితే కార్తికేయకు ఇప్పుడు ఏ విధంగా అదృష్టం కలిసి రాలేదు. మరి నెక్స్ట్ ఈ హీరో ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుంటాడో చూడాలి.