మొదటిచిత్రంతోనే సంచలన విజయం నమోదుచేశారు యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 భారీ హిట్ కొట్టింది. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో  హీరోయిన్స్ గా నటించగా, ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది. భగ్న ప్రేమికుడిగా కార్తికేయ, కన్నింగ్ లవర్ గా పాయల్ అధ్బుతంగా నటించారు. ఓ వినూత్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం యూత్ కి తెగ నచ్చేసింది. కాగా ఈ మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. అంత పెద్ద హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి మరో మూవీ మొదలుపెట్టలేదు. 

ఆయన మహాసముద్రం అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మూవీలో హీరోగా రవితేజ నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో దర్శకుడు అజయ్ భూపతి మరియు రవితేజ మధ్య విభేదాలు తలెత్తాయని కథనాలు రావడం జరిగింది. కాగా ఈ చిత్రంలో హీరో ఎవరనేది అధికారిక ప్రకటన జరగలేదు. తాజగా ఇద్దరు యంగ్ హీరో పేర్లు తెరపైకి వచ్చాయి. 

హీరో శర్వానంద్, కార్తికేయ ఈ మూవీలో నటించనున్నారట. అజయ్ భూపతి మల్టీస్టారర్ గా ఈ చిత్రాన్ని  తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే ఈ మూవీకి మంచి హైప్ వచ్చి చేరడం ఖాయం. మహాసముద్రం మూవీలో హీరోగా శర్వానంద్ పేరు ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. కొత్తగా హీరో కార్తికేయ పేరు వచ్చి చేరింది. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం మూవీ ఉండనుందట.