Asianet News TeluguAsianet News Telugu

'కార్తీక దీపం' నటికి చేదు అనుభవం.. ఫోన్ చేసి..మోసం !

మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక otp వస్తుంది.

Karthika Deepam serial artist usha rani vedio about credit card fraud jsp
Author
First Published Jun 16, 2024, 3:21 PM IST


 కార్తీకదీపం 2 సీరియల్  లో చేస్తున్న ఒక నటికి ఊహించని ఘటన జరిగింది. అయితే తనకు జరిగిన ఒక విషయాన్ని తన అభిమానులు, నెటిజన్స్ తో పంచుకుంది. మీరు ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు చేసింది. అయితే ఆమెకు జరిగిన చేదు అనుభవం ఏంటి? ఆమె విడుదల చేసిన వీడియోలో ఏముంది?

  ఉషారాణి .... కార్తీకదీపం 2లో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రధాన పాత్ర దీపకు అత్త క్యారెక్టర్ చేస్తోంది. అయితే ఈ నటికి సంబంధించి తాజాగా జరిగిన ఒక ఘటనను అభిమానులతో షేర్ చేసుకుంది.  తనకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. దానిని తన కుమారుడు బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ కార్డులో మొత్తం రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది. వాళ్లబ్బాయి తరచూ కార్డులను ప్యాంటు జేబులో పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశారు. పైగా ఆ కార్డు తనకు కావాల్సిన ఆన్ లైన్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్ కి లింక్ అయి ఉండటంతో పని అయితే జరుగుతోంది కదా అని లైట్ తీసుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Usha Rani (@usharani_actor)

 
అయితే కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక otp వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను. ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. 

 

నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను. జాగ్రత్తగా ఉండండి.మోసపోకండి’ అని  ఉషారాణి చెప్పుకొచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios