Asianet News TeluguAsianet News Telugu

కర్ర పట్టుకుని రేవ్‌ పెట్టాలి.. నటి హేమపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు.. `మా` నుంచి సస్పెండ్‌?

నటి హేమ బెంగుళూరు రేవ్‌ పార్టీలో పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో తాజాగా నటి కరాటే కళ్యాణి స్పందించింది. హేమపై ఫైర్ అయ్యింది. కర్రతో రేవ్‌ పెట్టాలంటూ హాట్‌ కామెంట్‌ చేసింది.

karate Kalyani fire on actress hema who cautched at bangalore rave party  arj
Author
First Published May 21, 2024, 11:23 PM IST

నటి హేమ ఇటీవల బెంగుళూరులో రేవ్‌ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అందులో ఉన్నది తాను కాదని, తాను ఫామ్‌ హౌజ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నానని చెబుతూ వీడియో పెట్టింది. కానీ పోలీసులు రిలీజ్‌ చేసిన ఫోటోల్లో హేమ ఫోటో కూడా ఉన్నది. దీంతో పెద్ద కన్ ఫ్యూజన్‌ ఏర్పడింది. అయితే నటి హేమ ఉన్నట్టు ఈ రోజు బెంగుళూరు కమిషనర్‌ అధికారికంగా ప్రకటించారు. ఆమె కూడా రేవ్‌ పార్టీలో ఉందని ఆయన స్పష్టం చేశారు. 

ఇదంతా కాదని హేమ ఇంట్లో బిర్యాని చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇలా మీడియాని, జనాలను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దీనిపై తాజాగా కరాటే కళ్యాణి స్పందించారు. హేమపై విరుచుకుపడ్డారు. ఆమెకి హైలైట్‌ కావాలనే పిచ్చి ఉంటుందని, అందుకే ఎక్కువగా హడావుడి చేస్తుంటుందని, ఇప్పుడు కూడా అదే చేసిందని, కానీ బాగా ఇరుక్కుపోయిందని తెలిపింది. అందరిపై ఆరోపణలు చేస్తూ ఊసురు పోసుకుందని, ఇప్పుడు ఆమెకే ఆ ఊసురు తగిలిందని ఆరోపించింది కరాటే కళ్యాణి. తనపై గతంలో పేకాట ఆడుతున్నట్టుగా ఆరోపణలు చేసి హడావుడి చేసిందని, తనని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిందని, ఇలా చాలా మందిపై ఆమె తన నోటి దూల చూపిస్తుందని ఆరోపించింది కరాటే కళ్యాణ

నటిగా ఆమెపై రెస్పెక్ట్ ఉందని, ఎంతో కష్టపడి ఎదిగిందని, కానీ ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోతుంది. ఆమె పెద్ద ఫేక్‌. మొదట్నుంచి అన్నీ ఫేక్‌ పనులే చేస్తుంటుందని, ఫేక్‌ వీడియో రిలీజ్‌ చేసి అందరిని తప్పుదోవ పట్టిస్తుందని, ఇప్పుడు చికెన్‌ వీడియోతో కూడా మరింతగా మిస్‌ లీడ్‌ చేస్తుందని, అయితే ఈ మిస్టేక్స్ చేస్తూ మరింత గట్టిగా దొరికిపోయిందని తెలిపింది. తాను పిలిస్తే వచ్చాను,  సిన్సియర్‌గా చెబితే బాగుండేది, కానీ హడావుడి చేసి గట్టిగా ఇరుక్కుందని చెప్పింది కరాటే కళ్యాణి. 

`రేవ్‌ పార్టీలు హైదరాబాద్‌లో నిషేధించారు కాబట్టి బెంగుళూరుకి వెళ్లారు. అందులో డ్రగ్స్ కూడా దొరికాయట, ఇది చాలా పెద్ద కేసు. ఆమెకి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నోటీ దూల తగ్గించుకో` అని చెప్పింది కరాటే కళ్యాణి. అంతేకాదు ఈ రేవ్‌ పార్టీలకు వెళ్లేవారికి కర్రపట్టుకుని రేవ్‌ పెట్టాలి అంటూ ఫైర్‌ అయ్యింది. మా అసోసియేషన్‌లో ఇలాంటి వాటిని ఎంకరేజ్‌ చేయరని, హేమకి సస్పెన్షన్‌ పడే అవకాశం ఉందని తెలిపింది కరాటే కళ్యాణి. అయితే ఈ కేసులో ఆమె క్లీన్‌గా రావాలని కోరుకుంటున్నట్టు చెప్పడం విశేషం.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios