బిగ్‌బాస్‌ 4 రెండో వారం ఎలిమినేషన్‌కి ఒక్కరోజే ఉంది. శనివారంతో తాడో పేడో తేలిపోనుంది. అయితే ప్రతి వారం ఒకరు ఎలిమినేట్‌ అవుతుంటారు. గత వారం దర్శకుడు సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. రెండో వారం కోసం తొమ్మిది మంది ఎంపికయ్యారు. 

రెండో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో గంగవ్వ, నోయల్‌, మోనాల్‌, సోహైల్‌, కరాఠే కళ్యాణి, అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి, హారిక, అభిజిత్‌ ఉన్నారు. అయితే వీరికి వచ్చిన ఓటింగ్‌ ప్రకారం చూస్తే కళ్యాణి, అమ్మ రాజశేఖర్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. 

కళ్యాణికి 19వేల ఓట్లు రాగా, అమ్మ రాజశేఖర్‌కి 25వేల 680 వచ్చాయి. ఈ లెక్కన కళ్యాణికి ఐదు శాతం ఓట్లు, రాజశేఖర్‌కి ఏడుశాతం ఓట్లే వచ్చాయి. వీరిద్దరు ఎలిమినేషన్‌కి దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం వీరిద్దరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. 

ఇక అత్యధికంగా దాదాపు డెబ్బై వేల ఓట్ల(19శాతం)తో అభిజిత్‌ టాప్‌లో ఉన్నాడు. రెండో స్థానంలో గంగవ్వ ఉండటం విశేషం. దాదాపు 65వేల ఓట్ల(18శాతం)తో రెండో స్థానంలో ఉంది. ఆమె ప్రస్తుతానికి సేఫ్‌ అనే చెప్పాలి. మిగతా వారికి చూస్తే నోయల్‌కి 45వేల ఓట్లు, మోనాల్‌కి 43,258ఓట్లు, సోహైల్‌కి 45,375ఓట్లు వచ్చాయి. 

హారికకి 44,374, కుమార్‌ సాయికి 29 429ఓట్లు వచ్చాయి. వైల్డ్ కార్డ్ తో వచ్చిన కుమార్‌ సాయి ఏమాత్రం అలరించలేకపోతున్నాడు. దీంతో రెండో వారం ఎలిమినేషన్‌లో కుమార్‌ సాయి పేరు కూడా వినిపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఇందులో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు రేపు తెలుస్తుంది.