షారుఖ్ ఖాన్ ను అడిగే ధైర్యం నాకు లేదు, కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నిర్మాత, దర్శకుడు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్. షారుఖ్ ను చూస్తే తనకు భయమేస్తుందన్నట్టుగా మాట్లాడారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నిర్మాత, దర్శకుడు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్. షారుఖ్ ను చూస్తే తనకు భయమేస్తుందన్నట్టుగా మాట్లాడారు. ఇంతకీ విషయం ఏంటంటే..?
రీ ఎంట్రీలో జోరు చూపిస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఇఫ్పుడు ఉన్నవారు ఎవరూ సాధించలేని విధంగా వెంట వెంటనే వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించి.. రెండు సినిమాలతో రెండు వేల కోట్ల మార్క్ ను టచ్ చేశాడు. అటు పఠాన్, ఇటు జవాన్ రెండు సినిమాలు వెయ్యికోట్లు క్రాస్ చేసి.. కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అంతే కాదు కంప్లీట్ గా పడిపోయిన బాలీవుడ్ ను ఈసినిమాలతో పైకి లేపాడు బాద్ షా.
ఇక కుర్ర హీరోలను మించి జోరు చూపిస్తున్న షారుఖ్ భాయ్.. యంగ్ స్టార్స్ కంటే కూడా హ్యాండ్సమ్ గా తన బాడీని మెయింటేన్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్స్ తో అదరగొడుతున్నాడు. ఇక ఇటు ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు షారుఖ్ క్యామియోరోల్స్ కూడా చేసుకుంటూ.. వచ్చాడు.
ఆమధ్య వచ్చిన భారీ మూవీ బ్రహ్మాస్త్రబఅలాగే ఆతరువాత వచ్చిన టైగర్ 3 లో కూడా షారుఖ్ గెస్ట్ రోల్ లో అలరించాడు. అయితే ఆయన ముచ్చటగా మూడో సినిమాలో కూడా క్యామియో రోలో చేయాల్సి ఉండేదట. కాని ఆ ప్రపోజల్ షారుఖ్ వరకూ వెళ్లకపోవడంతో.. అందులో బాద్ షా కనిపించలేదట. ఇంతకీ ఈ విషయం వెల్లడించింది ఎవరంటే.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్.
ఇంతకీ విషయం ఏంటీ అంటేు.. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత కరణ్ జోహార్ షారుఖ్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తాను తెరకెక్కించిన రీసెంట్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని లో షారుఖ్ నటించాల్సి ఉందని.. కాని తాను అడగలేదంటున్నారు. నేను అడిగితే షారుఖ్ కూడా క్యామియోలో నటిస్తాడు అని కానీ నాకు అతన్ని అడిగేంత గట్స్ లేవు అని కరణ్ జోహార్ తెలిపాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.