సైలెంట్‌గా ప్రారంభమైన `కాంతార` ప్రభంజనం కొనసాగుతుంది. ఈ చిత్రం రికార్డు కలెక్షన్లని వసూలు చేస్తుంది. తెలుగులో ఇది సరికొత్త రికార్డుల దిశగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఎంత వసూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
కన్నడ చిత్రం `కాంతార` ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఫుల్ రన్నింగ్‌లో ఉంది. ఇప్పుడు థియేటర్లలో ఉన్న చిత్రాల్లో బాగా కలెక్ట్ చేస్తున్న సినిమా ఇదొక్కటే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగులోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
`కాంతార` తెలుగు వెర్షన్ యాభై కోట్ల క్లబ్లో చేసింది. ఈ సినిమా తెలుగులో యాభై కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. తెలుగు వెర్షన్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ మొత్తాన్ని వసూలు చేసింది. అంతేకాదు డబ్బింగ్ చిత్రాల్లో ఇది రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో డబ్ అయి యాభై కోట్లు దాటిన రెండో సినిమాగా నిలిచింది. `కేజీఎఫ్` తర్వాతి స్థానంలో నిలిచింది. మరోవైపు మొత్తంగా డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో సినిమాగా `కాంతార` నిలవడం విశేషం.
సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన `కాంతార` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటిరోజునుంచే ఈ చిత్రం ఊపందుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. `కాంతార` కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. `కేజీఎఫ్` ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించింది.
