సారాంశం
గత ఏడాది పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాటు కాంతారా కూడా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి.
గత ఏడాది పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాటు కాంతారా కూడా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 చిత్రాలు భారీ అంచనాలతో విడుదలయ్యాయి. కానీ కాంతార తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.
కర్ణాటకలోని తుళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాంతార చిత్రానికి, రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా ఐక్యరాజ్య సమితిలో కాంతార చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు అంటే ఆ చిత్రం ఎంతలా ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు రిషబ్ శెట్టి కాంతార చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 27 అంటే సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దీనికోసం మైండ్ బ్లోయింగ్ పోస్టర్ తో అనౌన్సమెంట్ చేసారు. అగ్ని కీలలు విరజిమ్ముతున్నట్లు ఒక కాంతి కనిపించేలా పోస్టర్ ఉంది.దానిపై ఇది కాంతి మాత్రమే కాదు.. దర్శనం అని పోస్టర్ పై ఉంది. మొత్తంగా కాంతార ప్రీక్వెల్ హీట్ సోమవారం నుంచి షురూ కానుంది.