`హనుమాన్‌` సినిమాలో `కాంతార` హీరో.. ఏ పాత్రకి? ఏం జరిగింది?

`హనుమాన్‌` మూవీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఈ మూవీలో ఓ పాత్ర కోసం `కాంతార` హీరోని అనుకున్నారట. కానీ సెట్‌ కాలేదు. మరి ఏం జరిగింది, ఇంతకి ఏ పాత్రకి అనేది చూస్తే..

kantara hero in hanuman movie but what happened and which role ?

ప్రశాంత్‌ వర్మ రూపొందించిన `హనుమాన్‌` మూవీ ఇప్పుడు తెలుగులో సంచలనం సృష్టిస్తుంది. ఈ మూవీ ఇండియావైడ్‌గా అదరగొడుతుంది. రెండు వందల కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఓ వైపు అయోధ్య రాముడి ప్రభావం, సంక్రాంతి పండగ వాతావరణం, హనుమంతుడి ఎలిమెంట్లు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. సంచలనం సృష్టించాయి. చిన్న సినిమాగా ప్రారంభమై, ఇది రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఒక బాలనటుడి నుంచి ఎదిగిన తేజ సజ్జా ఈ రేంజ్‌ హిట్‌ కొట్టడం, పాన్‌ ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విభీషణుడి పాత్ర చాలా కీలకమైనది. హీరో తేజ సజ్జాకి బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ గా ఉండే పాత్ర అది. హనుమంతుడి మణి పనిచేయడంలో, ఆ మణి దుష్టుల చేతిలో పడకుండా చూసుకోవడానికి ఆయన రక్షణగా ఉండటం, హీరోని కాపాడటం చేస్తాడు. అంతిమంగా చేపట్టిన కార్యం పూర్తి కావడంలో ఆయన కీలక భూమిక పోషిస్తాడు. ఫస్టాఫ్‌ ఎండింగ్‌లో ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చా, ఎండింగ్‌ వరకు ఉంటుంది. ఆ పాత్రలో సముద్రఖని నటించారు. 

అయితే ఆ పాత్రకి మొదటి ఛాయిస్‌ `కాంతార` హీరో అట. `కాంతార` చిత్రంలో సంచలనం సృష్టించారు రిషబ్‌ శెట్టి. ఆ మూవీ సుమారు మూడు వందల యాభై కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించడం విశేషం. రెండు పాత్రల్లోనూ ఆయన అదరగొట్టారు. `హనుమాన్‌` మూవీలో విభీషణుడి పాత్రకి మొదట రిషబ్‌ శెట్టిని అనుకున్నారట దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆయన్ని అప్రోచ్‌ అయ్యారట. కానీ ఆ సమయంలో కాంతర పనిలో ఉండటంతో చేయలేకపోయినట్టు తెలిపారు. కానీ `హనుమాన్‌` సిరీస్‌లో ఆయన భాగం కానున్నారని తాజాగా ప్రశాంత్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు మున్ముందు భారీ కాస్టింగ్‌ ఈ సినిమా సిరీస్‌లో భాగం కానున్నారని తెలుస్తుంది. 

ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్‌ యూనివర్స్ లో దాదాపు 12 సినిమాలు చేయబోతున్నారట. సూపర్‌ హీరోల తరహాలో మైథలాజికల్‌ స్టోరీస్‌లో ఉండే ఒక్కో హీరోయిక్‌ పాత్రతో ఒక్కో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్ట్స్ ఆయన ఇప్పుడు `జై హనుమాన్‌` అనే సినిమా చేస్తున్నారు. రాముడి కోసం హనుమంతుడు ఇచ్చిన మాటని నెరవేర్చడం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించనున్నట్టు `హనుమాన్‌`లో వెల్లడించారు. మరి ఆ మాటేంటి? హనుమంతుడు ఏం చేయబోతున్నారని అనేది ఆసక్తికరం. ఇక ఇందులో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో ఒక సీనియర్‌ హీరో నటిస్తారని ప్రశాంత్‌ వర్మ చెప్పిన విషయం తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios