Kantara Chapter 1 Trailer: `కాంతార` మూవీకి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న `కాంతారః చాప్టర్ ` ట్రైలర్ వచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది.
Kantara Chapter 1 Trailer: శాండల్ మూడేళ్ల క్రితం వచ్చి సంచలనం సృష్టించింది `కాంతార` మూవీ. `కేజీఎఫ్` తర్వాత కన్నడ నుంచి వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమాని షేక్ చేసింది. తాజాగా ఈ చిత్రానికి ప్రీక్వెల్ వస్తోంది. 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ ఈరోజు (సెప్టెంబర్ 22) మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ అయింది. 2.56 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్, `బాహుబలి` తరహాలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.
`కాంతారః చాప్టర్ 1` తెలుగు ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ని ప్రభాస్ ఆవిష్కరించారు. హిందీలో హృతిక్ రోషన్, తమిళంలో శివకార్తికేయన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను కన్నడ అభిమానులే విడుదల చేయడం విశేషం.
యాక్షన్ థ్రిల్లర్‌గా `కాంతార 2`
సినిమా రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో, పోస్టర్లు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, ప్రగతి శెట్టి కాస్ట్యూమ్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు. 'కాంతార చాప్టర్ 1' సినిమా కళ, భక్తి, శక్తిల అద్భుతమైన కలయిక. హిస్టారికల్ అంశాల మేళవింపుతో ఇది సాగింది.
`కాంతార 2` ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్‌లో ప్రధానంగా `కాంతార` సినిమాలోని ఎండింగ్‌ని చూపించి, చిన్న కుర్రాడికి అసలు పూర్వం ఏం జరిగిందనేది వివరించడంతో ఈ ట్రైలర్ సాగింది. దీంతో కథ బ్యాక్ వెళ్లింది. అప్పుడు కూడా ట్రైబల్ ప్రాంతంలో ఓ రాజు ఉండేవాడు. ఆయన ఆధీనంలోనే అక్కడి గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో యువరాణిని రిషబ్ శెట్టి ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. రాజుపై హీరో పోరాటం, అది మనుగడ కోసం పోరాటంలా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్లు వాహ్ అనేలా ఉన్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. అయితే `కాంతార` సినిమాని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో కొంత నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు.

