Asianet News TeluguAsianet News Telugu

పండగ వేళ గుండెలు పగిలే విషాదం.. ఆరేళ్ళ కూతురుతో పాటు రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి.. కూతురు మృతి!

సంక్రాంతి పండగ వేళ కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనవరి 13 గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో పాటు స్కూటీ మీద వెళ్తుండగా భారీ లారీ ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.

kannda actress amrita naidu met with fatal accident
Author
Hyderabad, First Published Jan 14, 2022, 9:09 PM IST

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా చిత్ర ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. కరోనా మహమ్మారి తీవ్రత అధికం అవుతుండగా మరలా దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు నెమ్మదించాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడ్డాయి. మరోవైపు నటుల మరణాలు, ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. 2022 ప్రారంభమే సరిగా లేదు. ఎప్పుడేం జరుగుతుందోనన్న  భయం వెంటాడుతుంది. 

కాగా సంక్రాంతి పండగ వేళ కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ నటి అమృతా నాయుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనవరి 13 గురువారం రాత్రి ఆమె తన 6 ఏళ్ల కూతురు సమన్వితో పాటు స్కూటీ మీద వెళ్తుండగా భారీ లారీ ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. బెంగుళూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో చిన్నారి సమన్వి అక్కడిక్కడే మృతిచెందగా.. అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. అమృత నాలుగు నెలల గర్భవతి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె తన గర్భాన్ని కూడా పోగొట్టుకున్నారు.సీరియల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.  అమృతా నాయుడు పలు టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించగా కూతురు సమన్వి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. నానమ్మ సూపర్ స్టార్ రియాలిటీ షో లో సమన్వి పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. భవిష్యత్తులో ఆమె గొప్ప నటి అవుతుందని అందరు భావించారు. అనూహ్యంగా హఠాత్మరణంతో చిన్నారి సమన్వి ప్రాణాలు విడవడం బాధాకరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ విషాద ఘటన కన్నడ పరిశ్రమను విషాదంలో కి నెట్టింది.

కొద్ది నెలల క్రితం హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పునీత్ అకాల మరణం కన్నడ ప్రజలను భారీ కుదుపుకు గురిచేసింది. ఆయన మరణం మరవక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ సమన్వి కన్నుమూశారు. కనీసం అమృత కోలుకుని తిరిగి రావాలని అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు కోరుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios