Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ దేవర పై కిచ్చా సుధీప్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన నటిస్తున్న దేవర సినిమా గురించి స్పందించారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్. ఈమూవీ  గురించి మీడి నుంచి ప్రశ్నలు ఎదురుకాగా... ఆయన వన్ వర్డ్ ఆన్సర్ తో అదరగొట్టారు. 
 

Kannada Star Senior Hero Kiccha Sudeep Comments about Jr NTR Devara Movie JMS
Author
First Published Jan 17, 2024, 8:20 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్  నటిస్తున్న దేవర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి ఇంత వరకూ సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ మంచి ఆకలి మీద ఉన్నారు. అంతే కాదు దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు కన్నడాలో కూడా భారీ ఎత్తున ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో అక్కడ కూడా దేవర సినిమా గురించి అటు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా రిలీజ్ చేసిన దేవర  మూవీ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన  రెస్పాన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈసినిమా గురించి వారు ఎంత ఎదురు చూస్తున్నారో. తెలుగు గ్లింప్స్ కు ఎంత వ్యూస్ వచ్చాయో.. దేవర  కన్నడ వెర్షన్ గ్లింప్స్ కు కూడా పోటీ గా వ్యూస్ వచ్చాయి. అక్కడ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ గ్లింప్స్ కు  2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర భాషల్లో సైతం దేవర గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతితి తెలిసిందే. 

అయితే  దేవర గ్లింప్స్ గురించి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి స్పందించారు కన్నడ స్టార్ హీరో  కిచ్చా సుదీప్. ఆయనకు ఓ ప్రెస్ మీట్ లో  దేవర గ్లింప్స్ గురించి ప్రశ్న ఎదురు కాగా.. వన్ వర్డ్ ఆన్సర్ తో అదరగొట్టేశారు.  దేవర గ్లింప్స్ చూశానని ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకొచ్చారు. కిచ్చా సుదీప్ దేవర గ్లింప్స్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. కన్నడనాట కూడా ..హీరోల రియాక్షన్ సినిమాకు ప్లాస్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 


ఈ ప్రభావం ఇటు దేవరమీదే కాదు.. అటు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై కూడా పడే అవకాశం ఉంది. ఇక  దేవర సినిమా వేరే లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే ఏడాది సమయం కేటాయించారు. ఆర్ఆర్ఆర్ తో గ్లొబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈసినిమాను తీర్చి దిద్దాడు కొరటాల. ఈమూవీలోని యాక్షన్ సీన్స్ ఒళ్లు గగుడ్పొడిచే విధంగా ఉంటాయని టాక్. అందుకే యాక్షన్ కొరియోగ్రఫర్స్ గా ఫారెన్ టీమ్ దేవర కోసం రంగంలోకి దిగారు. 


ఇక దేవర మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్నా కొద్ది ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అటు మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ ను పాన్ ఇండియా రేంజ్  లో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అంతే కాదు షూటింగ్ కంప్లీట్ అవ్వక ముందే వరుసగా అప్ డేట్లు ప్లాన్ చేస్తున్నారు దేవర టీమ్. మూవీపై అంచనాలు ఇంకా పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా.. త్వరలో దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా తెరకెక్కుతుండగా అనిరుధ్ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్లు ఇచ్చారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. దేవర కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.త్వరలో దేవర చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios