ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్. ఇక ఆయన తాజాగా మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఆయన మీడియాకు ఎందుకు క్షమాపణలు చెప్పారు...?
కన్నడ స్టార్ హీరో సుధీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. కన్నడ నాట హీరోగా స్టార్ డమ్ ఉన్న సుధీప్.. టాలీవుడ్ లో ఈగ సినిమాతో విలన్ గా మార్చాడు రాజమౌళి. అప్పటి నుంచి టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా అలరిస్తున్నాడు సుధీప్. ఇక తరువాత తరువాత తను హీరోగా నటించిన కన్నడ సినిమాలను కూడా టాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో.. సుధీప్ కూడా తన సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ చేస్తూ వస్తేన్నాడు.
ఇక ఈ పాన్ ఇండియా హీరో నటించిన తాజా మూవీ విక్రాంత్ రోణ. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి అనూప్ బండారి దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథతో తెరకెక్కి ఈ సినిమా రిలీజ్ కు అన్ని సన్నాహాలు చేశారు. ప్రమోషన్ ఈవెంట్స్ కూడా భారీగా ప్లాన్ చేశారు సుధీప్. కాని వాటిలో చిన్న డిస్ట్రబెన్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది స్టార్ హీరో.
అందులో భాగంగా ప్రస్ మీట్లు ప్లాన్ చేసిన సుధీప్ వాటికి అటెండ్ అవ్వలేకపోయాడు. దాంతో మీడియా ప్రతినిధులకు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్ మీట్లకు హాజరు కాలేకపోతున్నానని... తనను క్షమించాలని కోరాడు. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్స్ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
అనారోగ్యం వల్ల ప్రయాణాలు చేయలేకపోతున్నానని,అందుకే ఈ రోజు జరగాల్సిన ప్రెస్ మీట్స్ రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. కోలుకున్న వెంటనే ప్రెస్ మీట్స్ నిర్వహిస్తామని... త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు. మీడియా వాళ్లకు కోపం రాకుండా.. తన ప్రన ప్రమోషన్స్ డిస్ట్రబెన్స్ అవ్వకుండా కిచ్చా మీడియాను అబ్యర్ధించారు.
