శ్రీవారిని దర్శించుకున్న కన్నడ స్టార్ సీనియర్ హీరో ఉపేంద్ర
ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర తిరుమల తిరుపతి లో సందడి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భగా ఆయన తెలుగు ఇండస్ట్రీపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కన్నడ ప్రేక్షకులతో పాటు.. తెలుగులె కూడా పేరున్న నటుడు ఉపేంద్ర. డిఫరెంట్ గా సినిమాలు చేయడంలో ఆయనకు ఆయే సాటి. ఈరోజు (17 మార్చి, శుక్రవారం ) ఉపేంద్ర నటించిన కబ్జ మూవీ రిలీజ్ అవుతుంది. ఈసందర్భంగా ఉపేంద్ర తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు పరిశ్రమపై కూడా ఆయన స్పందించారు. దర్శనం అనంతరం ఉపేంద్ర మాట్లాడుతూ..ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం యావత్తు భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమన్నారు. ఇది అందరూ గర్వించదగ్గ విషయం అన్నారు ఉపేంద్ర.
గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కబ్జా మూవీ డైరెక్టర్ చంద్రు మరియు కబ్జా టీమ్ మొత్తంతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉపేంద్రకు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా వరుస నిమాలు చేస్తున్నారు ఉపేంద్ర. ఒకప్పుడు టాలీవుడ్ ల కూడా ఆయన హీరోగా రాణించారు. ఆరతువాత కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర తెలుగులో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ కబ్జా. ఆర్ చంద్రు రైటర్ గా.. దక్షకత్వం వహించిన ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ మూవీలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించారు. తెలుగులో నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై ఈ మూవీని రిలీజ్ చేశారు. కబ్జా యావరేజ్ టాక్ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.