మహిళని పొట్టపై గాయపరిచిన స్టార్ హీరో కుక్క.. కేసు నమోదు, ఎలా జరిగిందంటే..
చిత్ర ప్రముఖులు ఊహించని విధంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇది కూడా అలాంటి సంఘటనే. ఓ మహిళ ఏకంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.

చిత్ర ప్రముఖులు ఊహించని విధంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇది కూడా అలాంటి సంఘటనే. ఓ మహిళ ఏకంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. హీరో దర్శన్ కి చెందిన రెండు కుక్కలు తనని తీవ్రంగా గాయపరిచాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమితా జిందాల్ అనే మహిళా ఈ కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఆమె హీరో దర్శన్ ఇంటి పక్కనే ఉన్న తన బంధువుల ఇంటికి ఓ కార్యక్రమం కోసం వెళ్ళింది. దర్శన్ ఇంటి సమీపంలోని ఖాళి ప్రదేశంలో ఆమె కారు పార్క్ చేసి బంధువుల ఇంటికి వెళ్ళింది. కార్యక్రమం ముగించుకుని వస్తుండగా తన కారు వద్ద కుక్కలు ఉండడాన్ని గమనించింది.
అవి హీరో దర్శన్ కుక్కలు. వాటి కేర్ టేకర్ కూడా అక్కడే ఉన్నారు. కారు పార్కింగ్ ప్రదేశంలో కుక్కలని ఇలా వదిలేస్తే ఎలా అని ఆమె కేర్ టేకర్ తో వివాదానికి దిగింది. ఇంతలో ఓ కుక్క సడెన్ గా తనపై అటాక్ చేసింది అని అమితా పేర్కొన్నారు. వెంటనే రెండవ కుక్క కూడా వచ్చి తనని పొట్టపై పలు మార్లు బాగా గాయపరిచాయని ఆమె ఫిర్యాదు చేశారు.
తన కుక్కలు కురుస్తున్నప్పటికీ వాటి కేర్ టేకర్ తప్పించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని అమితా ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సంఘటనలో ఆమె కేర్ టేకర్ ని మొదటి నిందితుడిగా, హీరో దర్శన్ ని రెండవ నిందితుడిగా కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా హీరో దర్శన్ పై కేసు నమోదు కావడం ఇదేమి కొత్త కాదు. పలు సందర్భాల్లో దర్శన్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. అతడి కాంట్రవర్షియల్ ఆడియో క్లిప్ వల్ల దర్శన్ రెండేళ్లపాటునిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డాగ్ సంఘటనపై దర్శన్ ఇంకా స్పందించలేదు.