శాండల్‌వుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.ఎం.విష్ణువర్ధన్ ఆదివారం మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీని కలచివేసింది.
శాండల్‌వుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.ఎం.విష్ణువర్ధన్ ఆదివారం మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీని కలచివేసింది.
గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న విష్ణువర్ధన్ ఆదివారం నాడు బెంగుళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సుదీప్, దర్శన్, శివన్న వంటి తారలు నటించిన హిట్ సినిమాలకు విష్ణువర్ధన్ ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిచూపు కోసం ఉంచారు. అంత్యక్రియల కోసం తమకూరు జిల్లాలోని కుదూరుకి తరలించారు.