గంజాయి కూడా తులసి లాంటిదే.. నటి ట్వీట్‌పై దుమారం
`సిత్తిరం పేసుదడి పార్ట్-2`, `మార్కండేయన్` సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ భామ నివేదిత. డ్రగ్స్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బ్యూటీ తులసి లాగా ఔషధ గుణాలు కలిగినదే గంజాయి కూడా` అంటూ ట్వీట్ చేసింది.
సాండల్ వుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు రాగిణి ద్వివేది, సంజన లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది కూడ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరో నటి కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యింది. డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించకపోయినా డ్రగ్స్ సేవించటం మంచిదే అన్నట్టుగా నటి చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది.
`సిత్తిరం పేసుదడి పార్ట్-2`, `మార్కండేయన్` సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ భామ నివేదిత. డ్రగ్స్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బ్యూటీ తులసి లాగా ఔషధ గుణాలు కలిగినదే గంజాయి కూడా` అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సాండల్‌వుడ్‌లో దుమారం రేపింది. నివేదిత తన ట్వీట్ గంజాయి గురించి మరిన్ని వివరాలు కూడా పోస్ట్ చేసింది.
నిషేదానికి ముందు గంజాయిని చాలా డ్రగ్స్‌లో కూడా వినియోగించేవారని, ఇప్పటికే 40 దేశాన్ని గంజాయి వినియోగంపై ఆంక్షలు లేవని, మన దేశంలో గంజాయి నిషేదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపింది. అయితే ఈ ట్వీట్‌పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. గంజాయిని హిందువులు పవిత్రంగా భావించే తులసి మొక్కతో పోల్చటం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.