నటుడిగా కన్నడ చిత్రాలతో హుచ్చా వెంకట్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వెంకట్ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించాడు. తాజాగా వెంకట్ వింత ప్రవర్తనతో అరెస్టయ్యాడు. వెంకట్ తాజాగా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఓ హోటల్ కు వెళ్ళాడు. 

వెంకట్ సెలెబ్రిటీ కావడంతో అక్కడున్నవారు అతడిని చూసేందుకు, పలకరించేందుకు వచ్చారు. కానీ వెంకట్ మాత్రం వింతగా ప్రవర్తించాడు. జనం హడావిడి నచ్చక అతడి కోపం కట్టలు తెంచుకుంది. రోడ్డుపైకి వచ్చి అక్కడ ఉన్న కారు అద్దాలని పగలగొట్టారు. కారు డోర్ ని ధ్వంసం చేశాడు. 

వెంకట్ ప్రవర్తనకు జనం ఆశ్చర్యపోయారు. వెంకట్ వింత ప్రవర్తనకు తగిన విధంగా జనం అతడికి దేహశుద్ది చేశారు. ఈ గొడవకు సంబంధించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంకట్ ని అరెస్ట్ చేశారు. వెంకట్ కన్నడ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నాడు. ఇలాంటి వివాదాలు వెంకట్ పై గతంలో కూడా ఉన్నాయి.