అనుష్క ప్రధాన పాత్రలో  ఆ మధ్యన సైజ్ జీరో అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం డైరక్ట్ చేసిన  ప్ర‌కాశ్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మెంట‌ల్ హై క్యా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

మీడియాని, తద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే రకరకాల విన్యాసాలు చేయాలి. ముఖ్యంగా పోస్టర్స్, ట్రైలర్స్ ద్వారా బజ్ క్రియేట్ చేయగలగాలి. అదే చేస్తున్నారు మెంట‌ల్ హై క్యా టీమ్. అయితే అదీ శృతిమించినట్లుగా అనిపిస్తున్నాయి. కానీ జనాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అదే దర్శక,నిర్మాతలకు కావాల్సింది కాబట్టి ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

వివరాల్లోకి వెళితే.. అనుష్క ప్రధాన పాత్రలో ఆ మధ్యన సైజ్ జీరో అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం డైరక్ట్ చేసిన ప్ర‌కాశ్ కోవెల‌మూడి ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మెంట‌ల్ హై క్యా అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏక్తా క‌పూర్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి రకరకాల పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఓ భిన్నమైన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించింది. 

పోస్ట‌ర్‌లో కంగ‌నా ర‌నౌత్‌, రాజ్ కుమార్ రావులు నాలుక‌పై ప‌దునైన బ్లేడ్‌ని ఉంచుకోవటం జనాలని హడులెత్తిస్తోంది. ఈ పోస్ట‌ర్‌ని చూసిన అభిమానుల ఒళ్ళు గ‌గుర్పాటుకి గుర‌య్యేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మెంట‌ల్ హై క్యా చిత్రాన్ని జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావు, కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో చిత్రం మెంట‌ల్ హై క్యా కాగా, తొలి సారి వీరిద్ద‌రు 2013లో వ‌చ్చిన డ్రామా చిత్రం క్వీన్‌లో న‌టించారు. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న మెంటల్ హై క్యా చిత్రానికి రచన : కనికా థిల్లాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రుచికా కపూర్.