రామ్‌చరణ్, రాజమౌళిలను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. ఫైర్ బ్రాండ్ స్కెచ్ పెద్దదే..
`చంద్రముఖి 2` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేస్తున్న కంగనా రనౌత్.. రామ్‌చరణ్, రాజమౌళిలకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తన మనసులో కోరిక బయటపెట్టింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హైదరాబాద్‌లో సందడి చేస్తుంది. ఆమె `చంద్రముఖి 2` చిత్ర ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. శనివారం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇక్కడి తెలుగు మీడియాతో వరుసగా ఇంటర్వ్యూలిస్తూ బిజీగా గడుపుతుంది. ఇందులో కంగనా రనౌత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. `చంద్రముఖి2`లో నటించడంతోపాటు తాను ఎవరితో పనిచేయాలనుకుంటుందో వెల్లడించింది. తన మనసులో మాటని బయటపెట్టిందీ ఫైర్ బ్రాండ్.
కంగనా రనౌత్.. తెలుగులో ప్రభాస్‌తో `ఏక్ నిరంజన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల క్రితం `తలైవి` చిత్రంలో మెరిసింది. ఇప్పుడు మళ్లీ `చంద్రముఖి2`తో సౌత్ సినిమాలు చేస్తుంది. అయితే ఈ అమ్మడి ఫోకస్ తెలుగుపై పడింది. టార్గెట్ టాలీవుడ్ అనే కాన్సెప్ట్ తో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇందులో తన మనసులో ఉన్న కోరిక బయటపెట్టింది.
తనకు రామ్‌చరణ్‌తో కలిసి సినిమా చేయాలని ఉందని చెప్పింది. యాక్ట్ చేయాలనుకుంటున్న ఒకే ఒక్క హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించగా రామ్‌చరణ్ సర్‌తో పనిచేయాలనుందని చెప్పింది. అలాగే ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉందని అడగ్గా, రాజమౌళి సర్‌తో పనిచేయాలని ఉందని చెప్పింది. అలాగే లతా మంగేష్కర్ పాటలంటే ఇష్టమని, ఆమె పాటలను వినాలనుకుంటానని వెల్లడించింది. ఈ సందర్భంగా పాలిటిక్స్ లోకి వెళ్తారా? అనే ప్రశ్నకి, తనకు అలాంటి ఆలోచనైతే ఇప్పుడు లేదని చెప్పింది.
ఇక తాను నటించాలనుకునే రోల్ గురించి చెబుతూ `చంద్రముఖి` అని, ఇప్పుడు సీక్వెల్‌లో నటించే అవకాశం వచ్చిందని, ఆ కోరిక తీరిందని పేర్కొంది. సౌత్‌లో ఎలాంటి సినిమా చేయాలని ఉందని చెప్పగా `చంద్రముఖి2` అని పేర్కొంది. అయితే కంగనా రనౌత్.. చాలా డిప్లామాటిక్‌గా సమాధానం చెప్పడం విశేషం. సాధారణంగా యాక్టర్స్ ఏ చిత్ర పరిశ్రమకి వెళ్ళి అక్కడ ప్రముఖ స్టార్స్ గురించి ప్రస్తావిస్తారు, తమ అభిమానాన్ని వెల్లడిస్తారు. అక్కడి ఆడియెన్స్ మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తారు. కంగనా కూడా అదే చేసిందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో రామ్‌చరణ్ క్రేజ్ అంతర్జాతీయంగా బాగా పెరిగింది. గ్లోబల్ స్టార్‌గా ప్రమోట్ అయ్యారు. `ఆస్కార్` ఈవెంట్ సమయంలోనూ ఆయన అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అది ఆయన ఇమేజ్‌ని మరింతగా పెంచింది. గ్లోబల్ వైడ్‌గా ఫోకస్ అయ్యేలా చేసింది. ఇక రాజమౌళి కూడా `బాహుబలి`తోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`ని ఆస్కార్‌కి పంపించి మరింతగా ఫోకస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కంగనా వారి పేర్లు వెల్లడించడం విశేషం.
ఇక `చంద్రముఖి` పాత్ర తనకిష్టమైన పాత్ర అని, అందుకే తాను ఇందులో అడిగి మరీ నటించినట్టు చెప్పింది. దర్శకుడ పీ వాసు వేరే కథతో తనకు వద్దకు వచ్చారని, కానీ ఆ సమయంలో `చంద్రముఖి2` సినిమా స్టార్ట్ చేశారు, అందులో హీరోయిన్ ఇంకా సెలక్ట్ కాలేదు. దీంతో తాను నటిస్తానని చెప్పడంతో ఆయన ఓకే చెప్పారని కంగనా వెల్లడించింది. రాఘవ లారెన్స్ తో నటించడం గొప్ప ఎక్స్ పీరియెన్స్ అని చెప్పింది. తాను సౌత్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు వెల్లడించింది. ఇక్కడ సినిమాలు చేయాలని ఉందని, ఆఫర్ల కోసం వేచి చూస్తున్నట్టు తెలిపింది కంగనా. ఇక రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా కథానాయికగా నటించిన `చంద్రముఖి2` ఈ నెల 28న విడుదల కాబోతుంది.