తనకు నచ్చినా.. నచ్చకపోయినా.. వెంటనే స్పందిస్తుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అది నెగెటీవ్ కానీ.. పాజిటీవ్ కాని వెంటనే చెప్పేస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నడ మూవీ కాంతార గురించి తన స్టైల్లో స్పందించింది కంగనా. ఇంతకీ ఆమెకు సినిమా నచ్చిందా..? లేదా..?  

తనకు నచ్చినా.. నచ్చకపోయినా.. వెంటనే స్పందిస్తుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అది నెగెటీవ్ కానీ.. పాజిటీవ్ కాని వెంటనే చెప్పేస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నడ మూవీ కాంతార గురించి తన స్టైల్లో స్పందించింది కంగనా. ఇంతకీ ఆమెకు సినిమా నచ్చిందా..? లేదా..? 

సైలెంట్ గా వచ్చి.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తోంది కన్నడ సినిమా కాంతార. కాసుల పండ పండిస్తున్న ఈ మూవీ కాన్సెప్ట్ కు పెద్ద పెద్దవాళ్లంతా పడిపోయారు. అప్పట్లో కెజియఫ్ లాగా సైలెంట్ గా వచ్చి.. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి నటించి.. ఆయనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండియా వైడ్ గా సెలబ్రెటీలను సైతం మెస్మరైజ్ చేస్తోంది. 

కాంతారా మూవీతో కన్నడ నాట మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి వందకు వంద మార్కులు సాధించారు. ఇక ప్రతీ విషయంలో తన దైన స్టైల్ లో స్పందించే బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా ఈమూవీ పై కూడా స్పందించారు. కాంతారా మూవీపై ప్రశంసల జల్లు కురిపించింది కంగనా రనౌత్. తను ఒక్కతే కాకుండా తన ఫ్యామిలీ అంతా కలిసి ఈ మూవీ చూసినట్టు ప్రకటించింది కంగనా. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేధికగా వెల్లడించింది. 

Scroll to load tweet…

కుటుంబ సభ్యులతో కలిసి కాంతార సినిమా చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈమూవీ కి మూల స్థంభం రిషబ్‌ శెట్టి గురించి ఏం చెప్పాలి. ఆయనకి హ్యాట్సఫ్‌. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సీన్స్ మేకింగ్ .. స్క్రీన్ ప్లే.. ఓవర్ ఆల్ గా ఈసినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇది.. ఇలానే ఉండాలి అంటూ కంగనా అన్నారు. 

 అంతే కాదు ఇప్పటి వరకు తాను చాలా సినిమాలు చూశానని . కాని ఇలాంటి అద్భుతమైన సినిమాను ఎప్పుడూ తాను చూడలేదంటూ చెప్పిన కంగనా. ఇదే అభిప్రాయం సినిమా చూసి బయటకు వస్తున్న కొందరు ప్రేక్షకులు అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది కంగనా రనౌత్. 

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన మూవీ కాంతార. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈసినిమాను కెజియఫ్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించారు. అక్టోబర్‌ 15న రిలీజ్ అయిన ఈసినిమాకు దేశవ్యాప్తంగా అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిషబ్ కు టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు స్టార్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ రిషబ్ కు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.