నెటిజన్లు సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆమీర్‌పై విమర్శలు చేశారు. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది.  తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమీర్‌ విడాకులపై స్పందిస్తూ, 

ఆమీర్‌ఖాన్‌, కిరణ్‌ రావు ఇటీవల విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 15ఏళ్ల వైవాహిక జీవితానికి వీరిద్దరు బ్రేక్‌ చెప్పుకున్నారు. ఈ వార్త విని ఆమీర్‌ ఖాన్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. తమ అభిమాన హీరో ఇలా చేశాడేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. నెటిజన్లు సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆమీర్‌పై విమర్శలు చేశారు. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. 

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఆమీర్‌ విడాకులపై స్పందిస్తూ, పంజాబ్‏లోని చాలా కుటుంబాలు ఒక సమయంలో ఒక కొడుకును హిందువుగా, మరొక కొడుకును సిక్కుగా పెంచేవాళ్లు. ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ రెండవసారి విడాకులు తీసుకున్నప్పటికీ, పిల్లలు మాత్రం ఎందుకు ముస్లీంగా గుర్తించబడతారనేది ఒక ఇంటర్ ఫెయిత్ వివాహంలో చూసి నేను ఆశ్చర్యపోతున్నా. స్త్రీ ఎందుకు హిందువుగా కొనసాగకూడదు. మారుతున్న కాలంతోపాటే మనం కూడా దీనిని మార్చాలి. 

ప్రస్తుతం అవలంభిస్తున్న పద్దతి చాలా పురాతనమైనది. ఒక కుటుంబంలో హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, రాధస్వామి, నాస్తికులు జీవించినట్లే.. ముస్లింలు కూడా ఎందుకు జీవించరు. ముస్లింలను వివాహం చేసుకోవడానికి మరొకరు(అమ్మాయిలు) ఎందుకు మతం మార్చుకోవాలి ? ` అంటూ ఘాటుగా ప్రశ్నించింది కంగనా. దీంతో ఆమీర్‌ విడాకుల విషయంపై కొత్త వివాదాన్ని లేవనెత్తింది కంగనా. 

ఆమీర్‌, కిరణ్‌రావు తామిష్టప్రకారమే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈమేరకు వీరిద్దరు జాయింట్‌ నోట్‌తోపాటు వీడియోని విడుదల చేశారు. తన కుమారుడు అజాద్‌ సంరక్షణ, పెంపక బాధ్యతలు తామిద్దరం చూసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ విడాకుల అంశంపై ఆమీర్‌ మొదటి కూతురు ఐరా ఖాన్‌ నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలంటూ వేసిన సెటైర్లు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమీర్‌ `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. కంగనా `ధాఖడ్‌`,`తేజాస్‌`, `తలైవి` చిత్రాలతో బిజీగా ఉంది.