బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి టార్గెట్ చేసి మూర్ఖులు అంటూ విమర్శించింది.
గతంలో 'మణికర్ణిక' సినిమా కోసం కంగనా గుర్రపుస్వారీ నేర్చుకోలేదని, డమ్మీ గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు నటించారని గతంలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను రణ్‌బీర్, అలియాల టీమ్ కావాలని లీక్ చేసిందంటూ రంగోలి పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు.
'బ్రహ్మాస్త్ర' సినిమా కోసం అలియా, రణ్‌బీర్ లు గుర్రపుస్వారీ చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ రంగోలి పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రణ్‌బీర్, అలియాలను ఉద్దేశిస్తూ ఈ ఇద్దరు మూర్ఖులు తమ కొత్త సినిమా కోసం గుర్రపుస్వారీ నేర్చుకోవడానికి వెళ్లి ఒక్కరోజుకే అలసిపోయారని.. మళ్లీ ప్రయత్నించలేదని చెప్పింది.
కానీ తన సోదరి కంగనా మాత్రం గుర్రపు స్వారీ నేర్చుకుంటూ మూడుసార్లు కిందపడిపోయిందని, ఎన్నో గాయాలయ్యాయని, అయినప్పటికీ ఏడాది పాటు కష్టపడి పట్టు సాధించిందని వెల్లడించింది. తనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నిరూపించండి అంటూ సవాల్ విసిరింది.
