. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఇప్పుడీ షో దేశం మొత్తంలో స్టార్స్ ని ఇటువంటి షో లు చేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు. అలా బాలయ్య దారిలో ముందుకు వచ్చిన స్టార్ కంగనా రనౌత్.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో సూపర్ హిట్ గా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఇప్పుడీ షో దేశం మొత్తంలో స్టార్స్ ని ఇటువంటి షో లు చేసేందుకు ఉత్సాహాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు. అలా బాలయ్య దారిలో ముందుకు వచ్చిన స్టార్ కంగనా రనౌత్.
తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుంది. కంగనా సన్నిహితురాలు ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసారు. బిగ్‌బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుంది. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది.
ఇక హోం మేడ్ రియాల్టి షోగా వస్తున్న ఈషోలో 16 మంది సెలబ్రిటీ( 16 celebritys)కంటెస్టెంట్‌లు ఉంటారు. వాళ్లతోనే ఈ షో రన్ అవుతుంది. ప్రోగ్రామ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా కంగనారనౌత్ లాక్ అప్ ప్రోగ్రామ్‌ని బిగ్‌బాస్ రియాల్టీ షోతో పోల్చింది. మా షో మీ పెద్దన్న ఇల్లు కాదని..ఇది నా జైలు అని చెప్పుకొచ్చింది కంగనా.
ఇక్కడ ఆట ఓ అత్యాచారం లాగా ఉంటుందన్నారు కంగనా. 72 రోజుల (72 days) పాటు 16 కంటెస్టెంట్‌లు కనీస అవసరాల కోసం కఠోరంగా శ్రమించాల్సి ఉంటుందని..కంగనా చెప్పింది. లాక్ అప్‌లో పార్టిసిపేట్ చేయబోయే వాళ్ల 16మంది సీక్రెట్‌లు తన దగ్గరుంటాయని..ఎలాంటి ఎమోషన్స్, సెంటిమెంట్స్ లేకుండా వ్యక్తి వాస్తవిక ఆలోచన, పద్ధతి, నడవడికను ఈ షోలో ప్రదర్శించాల్సి ఉంటుందని చెప్పింది బాలీవుడ్ క్యూట్ లేడీ.
కంగనా రనౌత్ ఫస్ట్ టైమ్ ఓ రియాల్టి షోకి హోస్ట్‌గా వ్యవహరించడం ఈ ప్రోగ్రామ్ స్పెషలిటీ. ఈ లాక్ అప్ షోలో సెలబ్రిటీలు ఎవరుంటారు..ప్రైజ్ మనీ ఏంటీ..లోపల ఎలాంటి టాస్క్‌లు ఉంటాయనే విషయాన్ని పూర్తిగా రివిల్ చేయలేదు క్వీన్ కంగనా.
