భయపెడుతుంది అనుకునే అందంతో మెస్మరైజ్ చేస్తుంది... అసలే ఫైర్ బ్రాండ్ కదా... భయంకరంగా ఉంటుంది అనుకుంటే.. బ్యూటీతో మనసును దోచేస్తోంది కంగనా రనౌత్. తాజాగా చంద్రముఖి2 నుంచి చంద్రముఖిగా కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
చంద్రముఖి అంటే ఎవరికైన ఏం గుర్తుకు వస్తుంది. జ్యోతిక చేసిన నటన.. పెద్ద పెద్ద కళ్లు.. భయపెట్టే వాయిస్... వణుకు పుట్టించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అంత సౌమ్యంగా ఉండే జ్యోతికానే ఆ పాత్ర చేస్తే అంత భయపెట్టింది కదా.. మరి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపిస్తే ఎలా ఉంటుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తాజాగా చంద్రముఖి2 నుంచి చంద్రముఖిగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీటీమ్. అయితే బయపెడుతుంది అనుకున్న కంగనా లుక్.. ప్రేక్షకుల మనసుదోచేస్తోంది.
మొన్న మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కంగనా క్లాసికల్ లుక్ లో ఒంపుసొంపుల ఒలికిస్తూ పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది. ఈ చంద్రముఖికి భయపడాల్సిన ఆడియన్స్ ఈ లుక్ చూసి మెస్మరైజ్ అవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు సౌమ్యంగా ఉన్న లుక్ ను రిలీజ్ చేసినా..ఆతరువాత కంగనా అసలు చంద్రముఖిని చూపిస్తారని తెలుస్తోంది.
2004 లో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది చంద్రముఖి2 మూవీ. ఆసినిమాను డైరెక్ట్ చేసిన పి.వాసు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ను రాఘవ లారెన్స్ చేస్తున్నాడు హర్రర్ సినిమాలకు బ్రాండ్ గా మారిపోయాడు రాఘవ.. ఆ ఎక్స్ పీరియన్స్ తో ఈసినిమాను అద్భుతంగా చేస్తాడన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఇక రాఘవాతో పాట్ కంగనా రనౌత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఒక నెల సమయమే ఉండడంతో ఇటీవలే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు టీమ్. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
