బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) మాట్లాడే ప్రతీమాట సంచలనమే అవుతుంది. చేసే ప్రతీ పని వివాదానికే దారి తీస్తుంది. ఇండస్ట్రీ నుంచి.. పాలిటిక్స్ వరకూ ఏ విషయాన్ని వదిలి పెట్టకుండ కామెంట్లతో హడావిడి చేస్తోంది కంగనా.

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) మాట్లాడే ప్రతీమాట సంచలనమే అవుతుంది. చేసే ప్రతీ పని వివాదానికే దారి తీస్తుంది. ఇండస్ట్రీ నుంచి.. పాలిటిక్స్ వరకూ ఏ విషయాన్ని వదిలి పెట్టకుండ కామెంట్లతో హడావిడి చేస్తోంది కంగనా.

నా ఫీలింగ్స్ నా ఇష్ణం అంటోంది కంగనా రనౌత్(Kangana Ranaut). ప్రతీ ఒక్కరికీ తమ ఫీలింగ్స్ చెప్పుకునే ఫ్రీడం ఉంది అంటోంది. ప్రతీ విషయంలో తన స్టైల్లో స్పందించే కంగనా...ఈ మధ్య ఆలియాభట్ విషయంలో కూడా ఘాటుగానే స్పందించింది. ఆలియా భట్ గంగూభాయ్ కతియావాడి (Gangubai Kathiawadi) సినిమా విషయంలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసిన కంగనా.. ఆ మాటలనుగట్టిగా సమర్ధించుకుంది.

గంగూభాయ్ కతియావాడి(Gangubai Kathiawadi) సినిమా ఓ వేశ్య కథాంశంతో తెరకెక్కింది. ముంబయ్ రెడ్ లైట్ ఏరియాకు సంబంధించి కామాటిపురాకు చెందిన వేశ్య గంగూభాయ్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగింది అనేది ఈసినిమాలో చూపించారు. ఈనెల 25న ఈసినిమా థియేటర్లను పలకరించబోతోంది. అయితే ఈసినిమాకు సంబంధించి చిన్న చిన్న మీమ్స్.. రీమిక్స్ వీడియోస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అందులో భాగంగా ఓ చిన్నారి గంగూభాయ్(Gangubai Kathiawadi) లాగ గెటప్ వేసుకుని వీడియో చేసింద ఈ వీడియో వైరల్ అవ్వగా..దీనిపై స్పందించింది బాలీవుడ్ బ్యూటీ కంగనా. ఓ చిన్నారి మీద ఇలాంటి సినిమాల ప్రభావం ఎలా ఉందో చూడండి అంటూ.. ఈ విషయంలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తానని కామెంట్ చేసింది. చిన్న పిల్లల తో బూతులు మాట్లాడించేలా ప్రభావం చూపుతుందంటూ. సినిమా టీమ్ ను కడిగిపడేసింది కంగనా..

ఇక ఈ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో మరోసారి తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చింది కంగనా(Kangana Ranaut). ప్రతీ ఒక్కరికి భావ ప్రకట స్వేచ్చ ఉంటుందని. ఆ చిన్నారి ఈసినిమాపై తన ఫీలింగ్ ను వీడియో రూపంలో చూపిస్తే.. తన ఫీలింగ్స్ ను తాను ప్రకటించానంటూ ఖరాఖండీగా చెప్పేసింది. కాంట్రవర్సీలతో ఆటలాడుకునే కంగనా. ఏ ఇష్యూ జరిగినా.. వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఫేస్ చేస్తుంది. తాను అనుకున్నది చెప్పి తీరుతుంది.