బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌, ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదంలో మరో బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు  చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత ఇండస్ట్రీలోని పెద్దలను విమర్శించేందుకు ఎలాంటి అండ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తాప్సీ పన్ను, స్వరా భాస్కర్‌లను బి గ్రేడ్ యాక్ట్రస్‌ అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు తమను తీవ్రంగా హర్ట్ చేశాయన్నారు తాప్సీ, స్వర.

కంగనా తన ఇంటర్వ్యూలో `ఇక్కడ నాకొక్కదానికే నష్టం జరుగుతుందా..? భవిష్యత్తులో ఎలాంటి వారసత్వం లేకుండా వచ్చిన కొంత మంది నటీమణులు నా గురించి కామెంట్‌ చేయోచ్చు. కరన్‌ జోహర్‌తో కంగనాకు మాత్రమే ప్రాబ్లం. మాకు ఎలాంటి సమస్యా లేదు. మేం కరణ్‌ను ప్రేమిస్తున్నాం అని కూడా చెప్తారు. కానీ నిజంగానే మీకు కరణ్‌ ఇష్టమైతే మీరు బీ గ్రేడ్ నటీమణులుగా ఎందుకు మిగిలిపోయారు? అలియా భట్‌, అనన్యల కన్నా మీరు అందంగా ఉంటారు. వాళ్ల కన్నా మీరు మంచి నటులు, అయినా మీకు అవకాశాలు ఎందుక ురావటం లేదు` అని ప్రశ్నించింది.

అయితే ఈ కామెంట్స్‌పై తాప్పీ, స్వర భాస్కర్‌లు ఘాటుగా స్పందించారు. `ఇది చాలా బాధాకరమైన అంశం. మనకు ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. అలాంటి ఇండస్ట్రీ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం దారుణం. ఇలాంటి వ్యాఖ్యలతో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే వారి తల్లి దండ్రుల్లో భయాందోళనలు కలుగుతాయి` అంటూ కామెంట్ చేసింది. బి గ్రేడ్ అనే వ్యాఖ్యలతో కంగనా తన ఇమేజ్‌ను డీ గ్రేడ్ చేసుకుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.