మల్టీటాలెంటెడ్ యాక్టర్ రాఘవ లారెన్స్ గత కొన్నేళ్లుగా ముని సీక్వెల్స్ తో హారర్ లో కొత్త టచ్ ని ఇస్తున్న సంగతి తెలిసిందే. మునిలోనే కాంచన అంటూ గంగతో కొత్త తరహా దెయ్యాల్ని సృష్టించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు కాంచన 3లో అంతకు మించిన భయాన్ని థ్రిల్ ని చూపిస్తాడట. 

ఇటీవల కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన దర్శకుడు సినిమాలో తన పాత్ర అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని అలాగే సినిమా షూటింగ్ కోసం ఎప్పుడు లేని విధంగా 220 రోజులు కష్టపడినట్లు చెప్పారు. ఇక కథ కథనంతో పాటు సినిమాలో గ్రాఫిక్స్ కూడా సరికొత్తగా ఉంటాయని ఏప్రిల్ 19న సినిమాను బారి స్థాయిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు. 

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బి.మధు నిర్మిస్తుండగా ఓవియా - వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.