Asianet News TeluguAsianet News Telugu

100 రోజుల వేడుకకు రెడీ అవుతున్న కమల్ హాసన్ విక్రమ్ మూవీ, ఎప్పుడు..? ఎక్కడంటే..?

సుమారు నాలుగయిదేళ్ళ తరువాత  లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విక్రమ్‌  సినిమాతో  ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వచ్చి రావడంతోనే  సూపర్ హిట్ సినిమాతో తనలో ఇంకా సత్తా అయిపోలేదని నిరూపించాడు. ఆడియన్స్ తో పాటు అభిమానులను కూడా దిల్ ఖుష్ చేశాడు కమల్.  లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజుల వేడుకకు రెడీ అవుతోంది.

Kamal Haasan Vikram Movie 100 days Celebration
Author
First Published Oct 28, 2022, 7:42 PM IST

 జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ మూవీ ఓవర్ ఆల్ గా దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్‌ హాసన్‌ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకూ చూసిన కమల్ హాసన్ ఒక ఎత్తు.. ఇప్పుడు చూస్తున్న కమల్ ఒక ఎత్తు అన్నట్టుగా.. తనలోని కొత్త యాంగిల్ ను ఈసినిమాలో చూపించాడు లోక నాయకుడు. అంతే కాదు ఈ సినిమా ఓటీటీలో కూడా అదే రేంజ్ లో దుమ్ము రేపుతుండటం విశేషం. 

కమల్ కెరియర్ లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది విక్రమ్. ఇక చాలా కాలంగా మర్చిపోయిన కొత్త సాంప్రదాయాన్ని మళ్ళీ ఈసినిమాతో మొదలుపెట్టబోతున్నారు. విక్రమ్ సినిమా కొన్ని సెంటర్స్ లో 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ 100 రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశారు టీమ్. చెన్నై లోని కలైవనార్ అరంగం వేదికగా.. ఈ వేడుక జరగనుంది. నవంబర్ 7వ తేదీన ఈ వేడుక ఘనంగా జరగనుంది. దీనికి  సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు.. అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు టీమ్. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. 


కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో  క‌మ‌ల్ హాస‌న్ - లోకేష్ క‌న‌గ‌రాజ్‌ కాంబినేషన్ లో  తెర‌కెక్కిన  విక్ర‌మ్‌. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.  ఈ సినిమా.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాస్టింగ్ కలెక్షన్స్ తో  సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇక త‌మిళంలో ఏకంగా  బాహుబ‌లి-2 రికార్డును బ్రేక్ చేసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన ప్రతీ భాషలో.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది విక్రమ్ మూవీ డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ లిస్ట్ లో  నిలిచింది. 

విశ్వరూపం తరువాత సినిమాలకు చాలా కాలం దూరం అయ్యాడు కమల్ హాసన్. ఇక కమల్ సినిమాలు వస్తాయా..? రావా..? అనుకున్న టైమ్ లో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు లోకనాయకుడు. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకమైన మైలు రాయిని దాటింది.  విక్రమ్ 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ మ‌ధ్య కాలంలో ఒక సినిమా రెండు వారాలు ఆడటమే ఎక్కువ. అంతకంటే ఎక్కువ రోజులు ఆడితే అది చాలా  పెద్ద విష‌యం. అలాంటిది విక్ర‌మ్ 100రోజులు పూర్తి చేసుకోవడం మేకర్స్ ను దిల్ కుష్ చేస్తోంది. 

దాదాపుగా 4ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్ హాసన్ తెర‌పై క‌నిపించ‌డంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా కమల్ కంప్లీట్ యాక్షన్ మూవీ చేయడం అది కూడా ఈ ఏజ్ లో చేయడం... హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.  ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. హీరో నితిన్ శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను రిలీజ్ చేశాడు. తెలుగులోకూడా సూపర్ హిట్ అవ్వడంతో హీరో నితిన్ గా ప్రోడ్యూసర్ గా సూపర్ సక్సెస్ సాధించారు. 

పక్కా యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈసినిమాలో  మ‌ల‌యాళ  స్టార్ యాక్టర్  ఫాహాద్ ఫాజిల్‌ తో పాటు తమిళ స్టార్ మక్కల్ సెల్వన్  విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ లో సినిమా అంతటిని ప్రభావితం చేశాడు. ఆయన పాత్ర‌లో 5 నిమిషాలు అయినా చాలా పవర్ ఫుల్ గా ఉంది. సూర్య పాత్ర డిజైన్ నుబట్టి ఈసినిమాకు సీక్వెల్ పక్కా అని తెలుస్తోంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ మూవీని  రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios