మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. కానీ ఇది సరిపోదన్నారు లోక నాయకుడు కమల్ హాసన్.
మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. కానీ ఇది సరిపోదన్నారు లోక నాయకుడు కమల్ హాసన్. మనకు పాన్ ఇండియా సరిపోదు. పాన్ వరల్డ్ కావాలంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారాయన. ఆయన హీరోగా నటించిన `విక్రమ్` సినిమా జూన్ 3న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
విక్టరీ వెంకటేష్, నితిన్, హరీష్ శంకర్, వెంకీ కుడుముల, బుచ్చిబాబు వంటి పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ ఈవెంటె్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసకికర వ్యాఖ్యలు చేశారు. తాను సింగిల్‌గా ఎదగలేదని, ఎంతో మంది దర్శకులు, టెక్నీషయన్ల వల్ల ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. ఏఎన్నార్ నటించిన `శ్రీమంతుడు` చిత్రానికి 45ఏళ్ల క్రితం డాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చాను. అప్పుడు తెలుగు ఫుడ్ తిన్నాను. నా బిగ్గెస్ట్ చిత్రాలు తెలుగు నుంచే వచ్చాయి. కంటిన్యూగా మీరు నాకు ఇక్కడ హిట్ ఇచ్చారు.
నా జర్నీ ఈ స్థాయికి రావడంలో నేను సింగిల్‌గా చేసింది కాదు. అలా అంటే దానికి నేను అర్హుడిని కాదు. నితిన్‌లాగే నాకు ఫ్యామిలీ ఉంది. వారు ఫుష్ చేశారు. నేను దర్శకుల వద్దకు వెళ్లాను. బాలచందర్‌గారితో 36సినిమాలు చేశాను. అదే నా పీహెచ్‌డీ. వెంకీ చెప్పినట్టు యాక్టర్, డైరెక్టర్, రైటర్, ఇలా అని అంటున్నారు. ఇవన్నీ కె.విశ్వనాథ్ నుంచి నేర్చుకున్నాను. విశ్వనాథ్‌గారు అద్బుతమైన నటుడు. నా స్టయిల్, రజనీకాంత్ స్టయిల్ అన్నీ వారి నుంచి పొందినవే. నాగేష్‌గారి స్టయిల్ కూడా విశ్వనాథ్ నుంచి వచ్చిందే` అని చెప్పారు.
వెంకటేష్ గురించి చెబుతూ, తనకు బ్రదర్‌లాంటివాడని, ఈ ఫంక్షన్ తనదని చెప్పారు. `ఒకరోజు ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెంకటేష్ వచ్చారని, తనని కలిశారని తెలిపారు. ఫిల్మ్ ఫెస్టివల్‌కి వచ్చారా? అంటే కాదు, మిమ్మల్ని చూడటానికి వచ్చానని తెలిపారు. సక్సెస్ ఉంది కానీ, ఇంకా ఏదో కావాలి. ఏం చేయాలని అడిగారు. అప్పుడు నాకు తెలిసింది చెప్పాను. ఆ తర్వాత వెంకీ కెరీర్ మరో టర్న్ తీసుకుంది. `మర్మయోగి` సినిమా కలిసి చేశాం. వెంకీ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రాండ్ ఉన్నా కష్టపడ్డారు కాబట్టే స్టార్ అయ్యారు` అని తెలిపారు కమల్.
తెలుగులో విడుదల చేసిన తన తెలుగు సినిమాలన్నీ సూపర్ హిట్ అని, ఆల్మోస్ట్ అన్ని మంచి విజయాలు సాధించాయని తెలిపారు. నేను నటించిన అన్ని సినిమాలు డబ్ చేయలేదని, నమ్మకం ఉన్న సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశానని, అవన్నీ విజయం సాధించాయని, అదంతా మీ తెలుగు ఆడియెన్స్ వల్లే సాధ్యమైందని తెలిపారు కమల్. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయని, కానీ అది సరిపోదన్నారు. పాన్ వరల్డ్ సినిమా స్థాయికి ఇండియన్ సినిమా ఎదగాలని తెలిపారు. ఆడియెన్స్ వల్లే సాధ్యమన్నారు. ఆడియెన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇవ్వాలని డిమాండ్ చేయాలని, క్వాలిటీ చిత్రాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు కమల్
ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న నితిన్, సుధాకర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ముందే హిట్ వస్తుందని చెప్పాను. హిట్ కార్డు, హిస్టరీ క్రియేట్ చేస్తుందన్నాను. ఎందుకంటే హిస్టరీ క్రియేట్ చేయడమనేది మీరిచ్చారు. ఆ ధైర్యంతోనే చెప్పానని తెలిపారు.
