ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్లు.. రేర్ కాంబినేషన్లు కామన్. ఒక్కోసారి షాకింగ్ కాంబినేషన్లు కూడా వస్తుంటాయి. త్వరలో కోలీవుడ్ నుంచి షాకింగ్ కాంబినేషన్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. కబాలీ దర్శకుడితో కమల్ హాసన్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.
లోక నాయకుడు కమల్‌హాసన్ జోరు మామూలుగా లేదు. చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కమల్ హాసన్ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత కమల్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కమల్‌కు అందులో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చింది విక్రమ్ అంతే కాదు ఈ బ్లాక్ బస్టర్ హిట్ తో కమల్ ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఈ చిత్రం . తమిళంలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లొ దాదాపు ఇదే సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కోలీవుడ్ లో మాత్రం బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దాదాపుగా 450 కోట్లకు పైనే వసూలు చేసింది సినిమా
ఇదే ఊపులో వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు కమల్ హాసన్. ఇక ఇప్పట్లో రాజకీయంగా కూడా పెద్దగా పనులు లేకపోవడంతో సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు లోక నాయకుడు. కమల్ ప్రస్తుతం మహేష్ నారయణ్ తో సినిమా చేయబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ దర్శకుడితో సినిమా ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాతో పాట్ ఇండియన్ 2 మూవీని కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు కమల్.
అయితే ఇప్పటికే ఇండియన్ 2 సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీల్ అయ్యింది. వివాదాల కూడా సర్థుమనగడంతో శంకర్ ను పిలిపించి ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట కమల్. అయితే శంకర్ టాలీవుడ్ లో రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఇండియన్ 2కి మోక్షం లభించే ఛాన్స్ లేదు అని తేలిపోయింది. రామ్ చరణ్ మూవీ నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అప్పటి వరకూ శంకర్ ఇండియన్ 2 ను రీ స్టార్ట్ చేసే అవకాశం లేదు. దాంతో ఈ లోపు కమల్ మరో సినిమాను పూర్తి చేయాలని భావించాడట.
ఇక మహేష్ నారాయణ్ సినిమాతో పాటు మరో క్రేజీ దర్శకుడితో కమల్ హాసన్ సినిమా చేయబోతున్నట్టు కోలీవుడ్ లో టాక్ వినపిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజీత్‌తో కమల్ క్రేజీ మూవీ ప్లాన్ చేసినట్టు సమాచారం. మద్రాస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సూపర్ స్టార్ రజనీ కాంత్ తో బ్యాక్ టూ బ్యాక్ కబాలి, కాలా వంటి సినిమాలతో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పా.రంజిత్. ఇక రీసెంట్ గా ఆర్యతో సార్పట్ట పరంపర తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం పా రంజిత్ స్టార్ హీరో విక్రమ్ తో సినిమా సినిమా చేస్తున్నాడు. విక్రమ్61 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈమూవీ రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకుంది. త్వరలో సెట్స్ ఎక్కబోతోంది. ఇక సినిమా తరువాత పా.రంజిత్, కమల్ హాసన్‌తో సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టినట్లు త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి డిఫరెంట్ గా గ్రామీణ నేపథ్యంలో కమల్ సినిమా తెరకెక్కుతుందని టాక్.
