Asianet News TeluguAsianet News Telugu

కమల్‌-మణిరత్నం మూవీ టైటిల్‌ `థగ్‌ లైఫ్‌`.. పూనకాలు తెప్పించేలా వీడియో.. బ్యాక్‌డ్రాప్‌ ఏంటంటే?

కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు సందర్బాన్ని పురస్కరించుకుని.. మణిరత్నంతో చేస్తున్న మూవీ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. దీనికి సంబందించిన వీడియో పూనకాలు తెప్పించేలా ఉంది.

kamal haasan maniratnam movie title thug life title announcement video mind blowing arj
Author
First Published Nov 6, 2023, 5:36 PM IST

కమల్‌ హాసన్‌(Kamal Haasan), మణిరత్నం కాంబినేషన్‌లో దాదాపు 36ఏళ్ల తర్వాత సినిమా వస్తుంది. ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని ప్రకటించారు. రేపు మంగళవారం(నవంబర్‌7) కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ముందుగానే ట్రీట్‌ ఇచ్చింది మణిరత్నం టీమ్‌. ఈ మూవీకి టైటిల్‌ని ప్రకటిస్తూ, ఒక అనౌన్స్ మెంట్‌ వీడియోని విడుదల చేశారు. అంతకు ముందే, మార్నింగ్‌ ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా ఈ సాయంత్రం టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `థగ్‌ లైఫ్‌` (Thug Life) అనే పేరుని నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఆద్యంతం యాక్షన్‌ సీన్ తో ఇది సాగింది. ఇందులో కమల్‌ తన పాత్రని పరిచయంచేస్తూ, తానేంటో చెప్పారు. తన పేరు `రంగరాయ శక్తివేల్‌ నాయకన్‌` అని చెప్పారు. `నాయకన్‌` చిత్రాన్ని గుర్తు చేసేలా, దానికి లింక్‌ ఉందని చెప్పేలా తన పేరుని వెల్లడించడం విశేషం. తాను క్రిమినల్‌ అని, గుండా అని చెప్పారు. ఆయన ఏడారిలో ఓ యోధుడిలా నిల్చొని ఉన్నారు. ఆయన్ని చంపేందుకు ఐదుగురు అత్యంత బలమైన విలన్లు భారీ ఆయుధాలతో దాడికి వచ్చారు. తనదైన యుద్ధ విద్యలతో కమల్‌ వారిని మట్టి కరిపించారు. 

ఇందులో తన పాత్ర, సినిమా కథా నేపథ్యాన్ని వివరించారు. ముఖ్యంగా తన పేరుని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పడం విశేషం. మాస్‌ లుక్‌లో, యోధుడిలా ఉన్నారు కమల్‌. ఆయన వేషదారణ చాలా కొత్తగా ఉంది. బందిపోటుని తలపించేలా ఉంది. ఇది గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తుంది. ఇందులో కమల్‌ బందిపోటు తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మణిరత్నం టేకింగ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌ బీజీఎం, కమల్‌ వాయిస్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. టైటిల్‌ గ్లింప్స్ ఆకట్టుకోవడమే కాదు, పూనకాలు తెప్పించేలా ఉంది. భారీ అంచనాలను పెంచుతుంది. 

కమల్‌ హాసన్‌ 234వ మూవీగా ఇది రూపొందుతుంది. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ గెయింట్‌ పతాకాలపై కమల్‌, మణిరత్నం, మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌,జయం రవి, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios