కమల్ హాసన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కమల్ హాసన్ ఆసుపత్రిలో జాయిన్ అయిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
కమల్ హాసన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కమల్ హాసన్ ఆసుపత్రిలో జాయిన్ అయిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తమిళనాడులో ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన తాను ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా కమల్ హాసన్ ప్రచారం ముమ్మరం చేశారు.
ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా కమల్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. వచ్చిన అందరికి ఓపికగా సెల్ఫీలు దిగారు. అయితే జనం పెరిగారు. తోపులాట జరిగింది. ఓ వ్యక్తి కమల్ కాలిని తొక్కాడు. ఈ ఏడాది ప్రారంభంలో కమల్ అదే కాలికి ఆపరేషన్ జరిగింది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడిపోయాడు.
నొప్పి పెరగడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కాలి గాయం పెరిగిందా అనే టెన్షన్‌లో ఎక్స్ రే తీయగా బాగానే ఉందని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కమల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న `భారతీయుడు 2` ఆగిపోయిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `విక్రమ్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ని కూడా వాయిదా వేశారు.
