మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన సీయూ సూన్ సినిమా ట్రైలర్‌ను లోక నాయకుడు కమల్‌ హాసన్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సీయూ సూన్‌ సినిమా సెప్టెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రీమియర్‌ కానుంది. మహేష్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫహాద్ ఫాజిల్‌, రోషన్‌ మాథ్యూ, దర్శన రాజేంద్రన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సబిన్‌ ఉరలికండి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ దర్శకత్వంలో ఫహద్‌ చేస్తున్న రెండో సినిమా కావటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా లాక్‌ డౌన్‌ సమయంలో తెరకెక్కించటం విశేషం. సినిమా రిలీజ్‌కు సంబంధించిన విశేషాలను అమెజాన్‌ ప్రైమ్‌ తన సోషల్ మీడియా పేజ్‌లోనూ షేర్ చేసింది.