Asianet News TeluguAsianet News Telugu

భారతీయుడు ఆగమనం ఖరారు.. సూర్య, లారెన్స్, బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ చిత్రాల అప్డేట్స్

భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. 

kamal haasan indian 2 Suriya Kanguva and other movie updates dtr
Author
First Published Apr 14, 2024, 10:13 PM IST

సోలో బాయ్ అంటూ వస్తున్న బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనిత చౌదరి గారు మాట్లాడుతూ : నన్ను అమ్మగా, అక్కగా, చెల్లిగా, వదినగా అన్ని పాత్రల్లోనూ ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా గౌతమ్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గౌతమ్ కి తల్లి పాత్రలో చేస్తున్నాను. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు అందరి గురించి  ఆలోచిస్తాడు. సెవెన్ హిల్స్ సతీష్ గారు ఈ సినిమాని ఎంతో పాషన్ తో నిర్మించారు. డి ఓ పి గా త్రిలోక్ పనితీరు చాలా బాగుంది. ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది అదేవిధంగా ఈ సోలో బాయ్ సినిమాలో కూడా ఒక మంచి ఫీల్ ఉంది. ప్రేక్షకుల సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

kamal haasan indian 2 Suriya Kanguva and other movie updates dtr

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న ఇలా నాకు ఒక టీం ఉంది నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా అనితా చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

‘భార‌తీయుడు 2’ జూన్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌

ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

kamal haasan indian 2 Suriya Kanguva and other movie updates dtr

‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఇవాళ తమిళ న్యూ ఇయర్ 'పూతండు' ఫెస్టివల్ సందర్భంగా 'కంగువ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్ గా  సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్ ను పోస్టర్ గా డిజైన్ చేశారు. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్ లో క్యాప్షన్ రాశారు. 'కంగువ' నుంచి రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగిస్తోంది.

kamal haasan indian 2 Suriya Kanguva and other movie updates dtr

'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

రాఘవ లారెన్స్ కొత్త సినిమా టైటిల్ 'హంటర్'  

రాఘవ లారెన్స్ నుంచి మరో వైవిధ్యమైన చిత్రానికి ప్రకటన వచ్చింది. వెంకట్ మోహన్ దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హంటర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ది బ్యాటిల్ ఫర్ ది సోల్ అనే క్యాప్షన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైగర్ తలపై తుపాకీ పట్టుకుని ఉన్న లుక్ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

kamal haasan indian 2 Suriya Kanguva and other movie updates dtr

Follow Us:
Download App:
  • android
  • ios