త్వ‌ర‌లోనే సెట్ పైకి రానున్న ఎన్టీ ఆర్ సినిమా ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ బాబీతో స్టోరి డిస్క‌ష‌న్ చేసిన జూనియ‌ర్ ఎన్టీ ఆర్ సినిమా నిర్మాత‌గా మారిన క‌ళ్యాణ్ రామ్
గబ్బర్ సింగ్ 2 ఇచ్చిన షాక్ తో సినిమా లేక అలా వుండిపోయారు దర్శకుడు బాబీ. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తరువాత సరైన డైరక్టర దొరక్క అలా వుండిపోయారు హీరో ఎన్టీఆర్. ఇప్పుడు ఇద్దరికి జత కుదిరిందని అధికారికంగా ప్రకటించేసారు. అంతేకాదు తమ బ్యానర్ లో ఎన్టీఆర్ 27 వ సినిమా బాబీ డైరక్షన్ లో చేస్తున్నట్లు నిర్మాతగా కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు.
తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మించాలని కళ్యాణ్ రామ్ చాలా కాలంగా అనుకుంటున్నారు. సో, అటు బాబీకీ సినిమా, ఇటు ఎన్టీఆర్ కు డైరక్టర్, కళ్యాణ్ రామ్ కోరిక అన్నీ తీరాయి ఒక్క సినిమాతో. ఫార్మల్ అనౌన్స్ మెంట్ తర్వత సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూట్ వుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ సెలక్షన్ ఇంకా కాలేదు. ఇప్పటిదాకా ఎన్టీఆర్ జతకట్టని హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
