Asianet News TeluguAsianet News Telugu

కల్యాణ్ రామ్ ని వివాదంలోకి లాగే ప్రయత్నం, వర్కవుట్ అవుతుందా?

ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌, ప్రెస్‌నోట్స్‌లో ద‌ర్శ‌కుడి పేరు క‌నిపించ‌క‌పోవ‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Kalyanram Devil Movie Directorial Controversy !jsp
Author
First Published Sep 15, 2023, 7:08 AM IST | Last Updated Sep 15, 2023, 7:08 AM IST

సాధారణంగా కళ్యాణ్ రామ్ ఏ వివాదంలోనూ ఇరుక్కోవటానికి ఇష్టపడరు. తన పనోదే తనది అన్నట్లు వెళ్లిపోతూంటారు. ఎక్కడా వివాదాస్పద స్టేట్మెంట్స్ ఇవ్వటానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఓ వర్గం మీడియా ఆయన్ని వివాదంలోకి లాగే పనిలో ఉంది..అది సఫలీకృతం అవుతుందా?
 
 కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో  చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్’.బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ (The British Secret Agent) అనేది ట్యాగ్‌లైన్. స్వాతంత్రానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్‌ను వేసి షూట్ చేస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో దర్శకుడు, నిర్మాత మధ్య విభేధాలు వచ్చినట్లు సమాచారం. దాంతో  షూటింగ్ పూర్త‌య్యి రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న‌ స‌మ‌యంలో సినిమా నుంచి ద‌ర్శ‌కుడు త‌ప్పుకోవ‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని నిర్మాత అభిషేక్ నామా చేప‌ట్టినట్లు అఫీషియ‌ల్‌గా ఈ సినిమాకు తానే డైరెక్ట‌ర్‌ను అంటూ ప్ర‌క‌టించారు.

 ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్‌, ప్రెస్‌నోట్స్‌లో ద‌ర్శ‌కుడి పేరు క‌నిపించ‌క‌పోవ‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దాంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదేమీ కొత్త విషయం కాదు గతంలోనూ నిర్మాత,దర్శకుల మధ్య విభేధాలు రావటం వేరే డైరక్టర్స్ సీన్ లోకి వచ్చి షూట్ పూర్తి చేయటం జరుగుతూ వస్తోంది. అప్పుడు ఇలాంటి వివాదాలే వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే..ఈ వివాదంలోకి కళ్యాణ్ రామ్ ని లాగాలనే ప్రయత్నం కనపడుతోంది.

డైరెక్ట‌ర్ మార్పు క‌ళ్యాణ్‌రామ్‌కు తెలుసా? లేదా? తెలిసినా ఎందుకు స్పందించటం లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, వెబ్ మీడియాలో ఆర్టికల్స్ మొదలయ్యాయి. మరో ప్రక్క  మొదట కళ్యాణ్ రామ్ ఈ విషయమై .. అభిషేక్ తో మాట్లాడి సెటిల్ చేద్దామనుకున్నారని.... అయినా  ఈ వివాదం ముగియకపోవడంతో.. అనవసరమైన వివాదాల్లోకి పోకుండా.. కళ్యాణ్ రామ్ న్యూట్రల్ గా ఉండిపోయాడని చెప్తున్నారు. హీరో ..డైరక్టర్ కు సపోర్ట్ గా ఉండాలని మరికొందరు అంటున్నారు. 

Kalyanram Devil Movie Directorial Controversy !jsp

  ఇక క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో 2021లో డెవిల్ మూవీని అనౌన్స్‌చేశారు. బింబిసార, అమిగోస్ షూటింగ్ వ‌ల్ల డెవిల్ రిలీజ్ ఆల‌స్య‌మైంది. 1947కి ముందు కాలం నాటి క‌థ‌తో బ్రిటీష్ రెసెడెన్సీ టైమ్ పీరియ‌డ్‌లో స్పై థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నాడు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బింబిసార త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్త మీన‌న్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios