నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో అలరించడానికి సిద్ధం అయ్యాడు. ఇప్పుడీ హీరో మరో చిత్రానికి  సై అన్నాడని తెలుస్తోంది. హ్యాపీడేస్ మూవీతో శేఖర్ కమ్ముల సృష్టించిన సెన్సేషన్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. 

ఈ చిత్రాన్ని తమిళ్ లో ఇనిదు..ఇనిదు పేరుతో రీమేక్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్.. దర్శకుడిగా మారి తమిళ్ హ్యాపీడేస్ ను తెరకెక్కించాడు. ఈ రీమేక్ వెర్షన్ అంతగా ఆడకపోవడంతో.. మళ్లీ గుహన్ దర్శకత్వం వైపుకు వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి దర్శకత్వం చేయాలని ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ ను కలిసి ఓ యాక్షన్ అడ్వంచరస్ మూవీకి స్టోరీ వినిపించాడట. కొన్ని భీకరమైన లొకేషన్స్ లో ఈ షూటింగ్ ఉంటుందని చెప్పాడట. మొదటగా ఈ లొకేషన్స్ ను ఆన్ స్క్రీన్ పై చూపడం సాధ్యమవుతుందా అని ఆలోచించాడట నందమూరి హీరో. 

కానీ డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ కూడా ఒకరే కావడంతో సరే చెప్పేశాడట. అలా తెలుగులో తన తొలి సినిమాను దర్శకత్వం వహించేందుకు కేవీ గుహన్ కు రంగం ప్రిపేర్ అయిపోతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. గుహన్ ఇప్పుడు తన స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నాడట.