నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ తెరకెక్కించిన చిత్రం '118'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రతిసారి కొత్తదనంతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కానీ ఫెయిల్ అవుతున్నాను. నాకు కూడా తెలుస్తుంది కానీ మిమ్మల్ని మెప్పించేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను'' అని చెప్పారు.