నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో సినిమాను ఫిక్స్ చేసినట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. కెరీర్ లో మరోసారి ఈ హీరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను చేయబోతున్నాడు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. 

ఫైనల్ గా నేడు చిత్ర యూనిట్ సినిమా సిద్దమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంప్రదాయాల చుట్టూ తిరుగుతూ అనుబంధాలను గుర్తు చేస్తుందని, శతమానం భవతి తరహాలో సతీష్ సినిమా స్క్రీన్ ప్లే ను సెట్ చేసుకున్నట్లు టాక్. ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ద్వారా మొదటిసారి ప్రొడక్షన్ హౌజ్ లోకి రాబోతోంది.

మెహ్రీన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. చివరగా 118సినిమాతో పరవాలేధనిపించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ నుంచి తుగ్లక్ అనే సోషయో ఫాంటసీ సినిమా విడుదల కానుంది.