ఒక సినిమా కథ మొదలైతే ఒకరిద్దరు హీరోల చుట్టూ తిరగకుండా ఉండదు. హీరోలకు కథ నచ్చినా కూడా ఎన్నో కారణాల వల్ల సినిమా పట్టాలెక్కకపోవచ్చు. ఇక రీసెంట్ గా ఉయ్యాల జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరించి వర్మ రాసిన కథ కూడా ఆ విధంగానే హీరోల చుట్టూ దర్శనం చేసింది. ఇక ఫైనల్ గా ఆ కథ నందమూరి హీరో దగ్గర వాలిపోయింది. 

ఇప్పుడిపుడే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి కొత్తగా అడుగులు వేస్తున్న కళ్యాణ్ రామ్ విరించి కథను వివరించిన విధానం బాగా నచ్చేసిందట. ఇంతకుముందు ఈ కథ యువ హీరోల చుట్టూ బాగా తిరిగినట్లు సమాచారం. మెగా కాంపౌండ్ లోకి వెళ్లి వచ్చినట్లు కూడా టాక్ వస్తోంది. చివరగా నానితో మజ్ను సినిమా చేసిన విరించి వర్మ మరో కథను సెట్స్ పైకి తేవడానికి చాలా కష్టపడ్డాడు. 

ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ఈ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మార్చ్ లో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు దర్శకుడు సిద్దమవుతున్నాడు. ఇక మొదట ఈ ప్రాజెక్టును జెమిని కిరణ్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 118 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.