Asianet News TeluguAsianet News Telugu

'అమిగోస్' ప్రీ రిలీజ్ బిజినెస్, షాకింగ్ న్యూస్

ఈ సినిమాలో హీరో ట్రిపుల్ రోల్ చేస్తున్నారు.  ఆ చిత్రం టీజర్ రిలీజ్ నాటి నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమై ఊపందుకుంది. 
 

Kalyan Ram New Movie Amigos pre release business
Author
First Published Jan 24, 2023, 11:06 AM IST


'బింబిసార' సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ... ఇప్పుడు 'అమిగోస్' సినిమాలో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నారు.  డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేసే హీరోల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ముందుంటున్నారు. ఈ క్రమంలో తన కంటూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ వెనుకాడని ఆయన ఇప్పుడు ఈ సినిమాపై మంచి నమ్మకాలే పెట్టుకున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూచించే పదం. ఈ సినిమాలో హీరో ట్రిపుల్ రోల్ చేస్తున్నారు.  ఆ చిత్రం టీజర్ రిలీజ్ నాటి నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమై ఊపందుకుంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  నాన్ దియేటర్ హక్కుల తో కలిపి విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం. అమిగోస్ తెలుగు ధియేటర్ హక్కులు 9 కోట్లు..(gst కాకుండా) అమ్ముడయ్యినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫెట్ ఈ మధ్యకాలంలో లేదు. దాంతో ఇది ట్రేడ్ షాకింగ్ క్రిందే చూస్తోంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించగా.. ఆశిఖ రంగానాథన్ ఫిమేల్ లీడ్‌గా నటించింది. టీజర్ విషయానికొస్తే, కోల్‌కతాకు చెందిన మైఖేల్‌గా కళ్యాణ్ రామ్.. అచ్చం తన పోలికలతో ఉన్నటువంటి మరో వ్యక్తితో ఫోన్‌లో పరిచయం చేసుకుంటాడు. తాను అతని డోపెల్‌గ్యాంగర్(ఒకేరూపం కలిగిన వ్యక్తి)ను అని చెప్తాడు. 

ఇలా ఒకే రూపం కలిగిన మరొకరితో కలిసి మొత్తం ముగ్గురు వ్యక్తులు కలవడం వెనక ఏదో సీక్రెట్ ఆపరేషన్ ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ‘మనం కలవడం అద్భుతం.. విడిపోవడం అవసరం’ అని మైఖేల్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగిస్తోంది.  మైఖేల్‌కు తన డోపెల్‌గ్యాంగర్స్ గురించి ఎలా తెలుసు? అసలు మైఖేల్ వాళ్లద్దరినీ వాడుకుని ఏం చేశాడు? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. కాగా.. కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో అద్భుతంగా కనిపించాడు. అంతేకాదు యాక్షన్ సీన్లతో నిండిన టీజర్ థ్రిల్లర్ మూవీని తలపించింది. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది.

మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్... 'అమిగోస్'లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళ మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే 'యెక యెక...' పాటను తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురి క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం చూపించారు. బీచ్ ఏరియాలో మాంచి స్టైలిష్, కలర్ ఫుల్ అమ్మాయిల మధ్య పాటను చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ మాత్రమే కాదు... నటుడు బ్రహ్మాజీ కూడా పాటలో ఉన్నారు.  టాలీవుడ్‌లో వరుస సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే ఈ ‘అమిగోస్’ చిత్రాన్ని కూడా నిర్మించింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios