చాలా గ్యాప్ తిసుకున్నాడు నందమూడి హీరో కల్యాణ్ రామ్. లేట్ అయినా డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బింబిసారుడిగా కనిపించబోతున్నాడు.
హీరోగాను .. నిర్మాతగాను కొత్త ప్రయోగాలతో కల్యాణ్ రామ్ ముందుకు వెళుతున్నాడు. తన సొంత బ్యానర్ పై తానే హీరోగా బింబిసార సినిమాను నిర్మించాడు. ఈ స్టోరీ గతంలోనూ, వర్తమానంలోను నడుస్తూ ఉంటుందని టాక్. ఈ మూవీలో కల్యాణ్ రామ్ రాజుగానే కాకుండా, మోడ్రన్ లుక్ తోను కనిపించనున్నాడు.
కీరవాణి - చిరంతన్ భట్ కలిసి పనిచేసిన ఈ సినిమాకి, వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఈ సినిమా కొంతకాలం క్రితమే పూర్తయినప్పటికీ సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు టీమ్. బింబిసారను అగస్ట్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
రిలీజ్ డేట్ తో పాట సూట్ వేసుకున్న కళ్యాణ్ రామ్ స్టయిలిష్ లుక్ రిలీజ్ చేశారు టీమ్. బింబిసార ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు కళ్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉందని ఆడియన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు క్రూరుడైన బింబిసారుడి లుక్‌లో... కదన రంగంలో శత్రు సైనికులను చంపి, వారి శవాలపై ఠీవిగా కూర్చున్న లుక్ రిలీజ్ చేశారు.
ఓ సమూహాం తాలూకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే... కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే... ఇందరి భయాన్ని చూస్తూ... పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం... బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం అంటూ డిఫరెంట్ డైలాగ్స్ తో రీజీజ్ చేసిన బింబిసార టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
