Asianet News TeluguAsianet News Telugu

అల్లు స్నేహా రెడ్డి ఫొటోలపై కళ్యాణ్ దేవ్ కామెంట్ వైరల్.. అలాంటి ఎమోజీ వదిలాడే.!

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తరుచూ తన భర్త బన్నీతో కలిసిన పిక్స్, తన ఫొటోషూట్ పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై కళ్యాణ్ దేవ్ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. 
 

Kalyaan Dhevs comment on Allu Sneha Reddys photos went viral
Author
Hyderabad, First Published Aug 16, 2022, 3:47 PM IST

ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహా రెడ్డి  (Allu Sneha Reddy) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఇంటి విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ అల్లు వారి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ముఖ్యంగా బన్నీతో కలిసి ఫొటోలు, తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను పలకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో స్నేహ రెండు రోజుల కింద ట్రెండీ డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్ గా నెట్టింట దర్శనమిచ్చింది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా నయా లుక్ తో మెస్మరైజ్ చేసింది.  స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ కు  సంబంధించిన ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోవడంతో లైక్స్, కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ ఫొటోలపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అల్లు పోస్ట్ చేసిన పిక్స్ పై కామెంట్ సెక్షన్ లో ఫైర్ ఎమోజీని వదలడంతో పాటు ‘స్నేహా..’ అంటూ కామెంట్ చేయడం మరింత వైరల్ గా మారింది. అయితే కళ్యాణ్ దేవ్ కామెంట్ ను చూసిన పలువురు నెటిజన్లు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘కాస్తా రెస్పెక్ట్  ఇవ్వూ’అంటూ రీకామెంట్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం స్నేహా గ్లామర్ ను పొగుడుతూ ఇంకా ఫొటోలను వైరల్ చేస్తూనే ఉన్నారు.  

స్నేహకు సోషల్ మీడియాలోనూ గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఇప్పటికే 8.3 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించుకుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ ఐకాన్ గా మెరిసినా తన ఫాలోవర్స్ ను మాత్రం ఆయా ఫ్యామిలీ ఫొటోలు, అల్లు అర్జున్ పిల్లలతో ఆడుకునే వీడియోస్ పంచుకుంటూ బన్నీ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. కొన్నాళ్ల పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమాయణం తర్వాతనే  పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహాం 2011 మార్చి 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా అనుకున్నది సాధించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ జంట స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. బన్నీ, స్నేహా నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై జెండా వందనం విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios