Asianet News TeluguAsianet News Telugu

'విజేత'కు క్లీన్ యు!

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. 

Kalyaan Dhev’s Vijetha Completes Censor formalities

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు:

కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.

నిర్మాత: రజిని కొర్రపాటి

సాయి కొర్రపాటి ప్రొడక్షన్ 

ప్రెజెంటర్: సాయి శివాని

కెమెరామెన్: కె.కె.సెంథిల్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సాహిత్యం: రెహమాన్ రామజోగయ్య శాస్త్రి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ

స్టంట్స్: జాషువ

Follow Us:
Download App:
  • android
  • ios