Asianet News TeluguAsianet News Telugu

భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలనుకున్నావా? ధన్యకి షాకింగ్ వార్నింగ్

ధన్య.. నన్ను వివాదానికి ఆహ్వానిస్తున్నావు. సరే త్వరలో కోర్టులో కలుసుకుందాం. నీ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్‌ చేసిన నువ్వు.

Kalpika Ganesh warning to Dhanya Balakrishna
Author
First Published Dec 15, 2022, 2:04 PM IST


ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కల్పిక. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్‌ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక​ ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది. అది ఇప్పుడు ఇష్యూగా మారింది. 

నటి ధన్య బాలకృష్ణపై షాకింగ్‌ ఆరోపణలు చేసింది మరో నటి కల్పికా గణేశ్ . ధన్య తనని గొడవల్లోకి ఆహ్వానిస్తోందని అన్నారు. ‘‘ధన్య.. నన్ను వివాదానికి ఆహ్వానిస్తున్నావు. సరే త్వరలో కోర్టులో కలుసుకుందాం. నీ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టే సరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్‌ చేసిన నువ్వు.. రాత్రి అన్‌బ్లాక్‌ చేసి వరుసగా కాల్స్‌ చేశావు. భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలనుకున్నావా?. ఏం చేసుకుంటావో చేసుకో. నీతో కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నా. క్షమాపణలు వద్దు. అలాగే అవకాశాలు కూడా వద్దు. ఎందుకంటే అనుకోకుండా నేను నటిని అయ్యాను. ఇది కాకపోతే వేరే పనులు చేసుకుంటా. నీ పవర్‌ చూపించి నేను షేర్‌ చేసిన వీడియోను యూట్యూబ్‌ ఖాతాలో లేకుండా చేశావు కదా. నా పవర్‌ చూపిస్తే భస్మమైపోతారు’’ అని కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్‌, రెక్కీ వంటి వెబ్‌ సిరీస్‌లో ఆమె హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్‌ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్‌ తన యూట్యూబ్‌ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది.

ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున​ క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు.  గత కొన్నిరోజుల నుంచి ధన్య ఏ సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేదని, ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉందేమోనని తాను అనుకుంటున్నానని అన్నారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఉన్నట్టుండి ఈ వీడియో యూట్యూబ్‌లో అదృశ్యమైంది.  అయితే కాపీ రైట్‌ ఇష్యూ కారణంగా యూట్యూబ్‌ ఈ వీడియోను డిలీట్‌ చేసింది. 

 ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ.. ‘‘కోలీవుడ్‌ స్టార్‌ హీరో అండ చూసుకుని.. నా ఖాతాలో ఉన్న వీడియోను బ్లాక్‌ చేయించారు. యూట్యూబ్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. మనం పెట్టిన ఏదైనా వీడియోను బ్లాక్‌ చేయాలంటే ముందు ఆ వ్యక్తికి ఒక మెయిల్‌ పెట్టాలి. కానీ, నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా ఖాతా నుంచి వాళ్లు ఎలా తొలగిస్తారు? దీని గురించి నేను మరింత తెలుసుకుంటాను’’ అని కల్పిక అంది.

Follow Us:
Download App:
  • android
  • ios