Asianet News TeluguAsianet News Telugu

కల్కి చిత్రానికి మహేష్ బాబు రివ్యూ... ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు!

కల్కి చిత్రాన్ని మహేష్ బాబు కొంచెం ఆలస్యంగా చూశారు. చూసిన వెంటనే తన రివ్యూ ఇచ్చేశాడు. హీరో ప్రభాస్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

kalki movie blown my mind says hero mahesh babu made interesting comments on prabhas ksr
Author
First Published Jul 8, 2024, 11:28 PM IST | Last Updated Jul 8, 2024, 11:28 PM IST

మహేష్ బాబు కల్కి 2829 AD  చిత్రం చూశారట. ఈ నేపథ్యంలో మూవీ ఎలా ఉందో తన అభిప్రాయం తెలియజేశాడు. హీరో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొత్తగా విడుదలైన సినిమాలు చూసి రివ్యూలు ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు. ఈ మధ్య ఆయన సెలెక్టివ్ గా సినిమా రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కల్కి చిత్రాన్ని చూశారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

కల్కి మూవీ చూసి నా మైండ్ బ్లాక్ అయ్యింది. నాగ్ అశ్విన్... భవిష్యత్ దృష్టికోణానికి హ్యాట్సాఫ్. కల్కి మూవీలో ప్రతి ఫ్రేమ్ కళాఖండం. అమితాబ్ సర్, మీ ప్రదర్శన సాటిలేనిది. కమల్ హాసన్ సర్, మీరు చేసే ప్రతి పాత్ర మీ వలె అసాధారణం. ప్రభాస్, ఎప్పటిలాగే ఓ గొప్ప పాత్ర అలవోకగా చేశావు. దీపికా పదుకొనె, ఎప్పటిలాగే నువ్వు అమేజింగ్... వైజయంతీ మూవీస్ కి శుభాకాంక్షలు... అని కామెంట్ చేశాడు. 

మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు కల్కి చిత్రం పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ బాబు చేరారు. కాగా కల్కి మూవీ వసూళ్ళు రూ. 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఓవర్సీస్ లో కల్కి చిత్రానికి భారీ ఆదరణ దక్కడం విశేషం. 

యూఎస్ లో కల్కి $ 15 మిలియన్ వసూళ్లు దాటేసింది. అక్కడ ప్రభాస్ నటించిన నాలుగు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. దర్శకుడు నాగ్ అశ్విన్ మైథాలజీ-సైన్స్ ఫిక్షన్ మిళితం చేసి కల్కి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ దాదాపు రూ. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. కల్కి పార్ట్ 2 మరింత అద్భుతంగా ఉంటుందని నాగ్ అశ్విన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios